ఆయిల్‌పామ్ పండిస్తే ప్రోత్సాహకాలు .. వరే కాదు ఇదీ కావాలి : రైతాంగానికి కేటీఆర్ సూచనలు
రాష్ట్ర రైతాంగానికి కీలక సూచనలు చేశారు తెలంగాణ ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఆయిల్‌పామ్ పండించాలని ప్రోత్సహిస్తున్నామని.. 20 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేటీఆర్ వెల్లడించారు.

రాష్ట్ర రైతాంగానికి కీలక సూచనలు చేశారు తెలంగాణ ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. శుక్రవారం వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో ఆయిల్‌పామ్ పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లక్షల టన్నుల వంట నూనెను దిగుమతి చేసుకుంటున్నామని, రైతులు వరి మాత్రమే పండిస్తే సరిపోదన్నారు. ఆయిల్‌పామ్ పండించాలని ప్రోత్సహిస్తున్నామని.. 20 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేటీఆర్ వెల్లడించారు. మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు ఇప్పటికే ఆయిల్ పామ్ సాగుచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ పంటను సాగు చేసే వారికి ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తోందని కేటీఆర్ గుర్తుచేశారు.
ALso Read: చంద్రబాబు అరెస్ట్.. ఢిల్లీలో మీ ఇష్టం, హైదరాబాద్‌లో మాత్రం : కవిత సంచలన వ్యాఖ్యలు
ఇకపోతే.. హైదరాబాద్‌లో అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ గ్రీన్‌ఫీల్డ్ ఆర్ అండ్ డీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ వృద్ధికి ఇది నిదర్శనమన్నారు. అడ్వెంట్‌కు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహకరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ సంస్థ తెలంగాణలో దాదాపు రూ.16,650 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.