హైద్రాబాద్ బాలానగర్  ఫ్లై ఓవర్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు ప్రారంభించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతోంది.  రూ.387 కోట్లతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు.

హైదరాబాద్: హైద్రాబాద్ బాలానగర్ ఫ్లై ఓవర్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు ప్రారంభించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతోంది. రూ.387 కోట్లతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు.2017 ఆగస్టు 21న మంత్రి కేటీఆర్‌ ఈ ఫ్లై ఓవర్‌ పనులకు శంకుస్థాపన చేశారు.స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా బాలానగర్‌, ఫతేనగర్‌ డివిజన్లను ఈ ఫ్లైఓవర్ అనుసంధానించనుంది.

also read:ఆరు లేన్లతో తొలి నిర్మాణం:బాలానగర్ ఫ్లైఓవర్ రేపే ప్రారంభం

నర్సాపూర్‌ చౌరస్తాగా ప్రసిద్ధి గాంచిన బాలానగర్‌ చౌరస్తా వాహనాల రాకపోకలకు ఎంతో కీలకం. సికింద్రాబాద్‌ నుంచి కూకట్‌పల్లి వరకు అమీర్‌పేట వైపు నుంచి జీడిమెట్ల వైపు వెళ్లే వాహనాలకు బాలానగర్‌ కేంద్రంగా ఉంటుంది.భారీ ఫ్లై ఓవర్ల నిర్మాణంలో ఎంతో అనుభవం ఉన్న హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఈ ఫ్లై ఓవర్‌ పనులను చేపట్టింది.అత్యాధునిక ఫ్రీకాస్ట్‌ టెక్నాలజీని వినియోగించి 1.13 కిలోమీటర్ల దూరంతో ఇరువైపులా వాహనాలు రాకపోకలు సాగించేలా 6 వరుసలతో బ్రిడ్జిని నిర్మించారు.

Scroll to load tweet…

ఈ బ్రిడ్జి వెడల్పు 24 మీటర్లు. మొత్తం 26 పిల్లర్లు వేసిన అధికారులు ఆయా పిల్లర్లపై 22 ఆర్సీసీ గడ్డర్లు, 3 స్టీల్‌ గడ్డర్లు ఏర్పాటు చేశారు.ఒక్కో ఆర్సీసీ గడ్డరు పొడవు 30 మీటర్లు, వెడల్పు 24 మీటర్లుగా ఉంటుంది.మూడు స్టీల్‌ గడ్డర్లు మాత్రం 40 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో నిర్మించారు.ప్లెఓవర్‌ నిర్మాణ పనులకు రూ.70 కోట్లు, కట్టడాల తొలగింపు, విద్యుత్‌ లైన్ల తరలింపు, తాగునీటి పైప్‌లైన్‌, రోడ్డు పునరుద్ధరణకు రూ.52 కోట్లు, భూ సేకరణ కోసం రూ.265 కోట్లు ఖర్చు చేశారు.ఫ్లై ఓవర్‌పై బీటీ రోడ్డుతో పాటు డివైడర్‌ను సైతం ఏర్పాటు చేసి పూల మొక్కలతో అందంగా ముస్తాబు చేశారు. రాత్రి వేళల్లో వెలుతురు ఉండేలా ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు.