Asianet News TeluguAsianet News Telugu

ఆరు లేన్లతో తొలి నిర్మాణం:బాలానగర్ ఫ్లైఓవర్ రేపే ప్రారంభం

హైద్రాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గాను తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.  ఇందులో భాగంగా నగరంలో పలు చోట్ల అండర్ పాస్ లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. ఎన్ఆర్‌డీపీ (వ్యూహాత్మక రోడ్ల అభివృద్ది ప్రణాళిక) పథకం కింద నిర్మించిన బాలానగర్ ఫ్లై ఓవర్ ను  ఈ నెల 6న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని  ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
 

Balanagar Flyover to open for public on Tuesday lns
Author
Hyderabad, First Published Jul 5, 2021, 8:35 PM IST


హైదరాబాద్: హైద్రాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు గాను తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.  ఇందులో భాగంగా నగరంలో పలు చోట్ల అండర్ పాస్ లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. ఎన్ఆర్‌డీపీ (వ్యూహాత్మక రోడ్ల అభివృద్ది ప్రణాళిక) పథకం కింద నిర్మించిన బాలానగర్ ఫ్లై ఓవర్ ను  ఈ నెల 6న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని  ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

1.13 కిలోమీట‌ర్ల మేర నిర్మించిన బాలాన‌గ‌ర్ ఫ్లై ఓవ‌ర్‌ను మంగ‌ళ‌వారం ప్రారంభించ‌నున్నారు.ఈ విష‌యాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్, హెచ్ఎండీఏ టీమ్‌కు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు మంత్రి.

 

2017 ఆగస్టు 21న బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.385 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు, 24 మీటర్లు వెడల్పు 26 పిల్లర్లతో నిర్మించారు. ఈ బ్రిడ్జికి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్‌ నగరంలోని అతి ప్రధాన రహదారుల్లో ఒకటి. ఆరు లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జి ఇది. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేశారు. దీనికి బాబూ జగజ్జీవన్‌రామ్‌ బ్రిడ్జిగా నామకరణం చేయనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios