Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సిన్.. హైదరాబాద్ ప్రాముఖ్యత పెరిగింది: కేటీఆర్

తెలంగాణ నుంచే కరోనా వైరస్‌కు తొలి టీకా వస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ జీనోమ్ వ్యాలీలో వున్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం సందర్శించారు

telangana minister ktr feels confident that corona vaccine will come from hyderabad
Author
Hyderabad, First Published Aug 4, 2020, 3:26 PM IST

తెలంగాణ నుంచే కరోనా వైరస్‌కు తొలి టీకా వస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ జీనోమ్ వ్యాలీలో వున్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం సందర్శించారు.

ఆయన వెంట డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా భారత్ బయోటెక్ ఉద్యోగులతో కేటీఆర్ మాట్టాడారు. అనంతరం కృష్ణా ఎల్లా, తెలంగాణ లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్‌తో కలిసి కేటీఆర్ చర్చను నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉండటం గర్వంగా ఉందన్నారు. కరోనాకు టీకా తొలుత హైదరాబాద్ నుంచి, అందులో భారత్ బయోటెక్ నుంచి మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. టీకాల అభివృద్ధి, తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచదేశాలు చెబుతున్నాయని కేటీఆర్ చెప్పారు.

హైదరాబాద్ నుంచి మూడవ వంతు వ్యాక్సిన్ ప్రపంచదేశాలకు అందించడం గర్వంగా వుందని, మీ అందరి నిరంత కృషి వల్లే ఇది సాధ్యమవుతోందని కేటీఆర్ ప్రశంసించారు. కాగా ఈ చర్చా కార్యాక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios