Telangana: సోమ‌వారం బ‌డ్జెట్-2022 పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ వాణిని బ‌లంగా వినిపించ‌డానికి టీఆర్ఎస్ ఎంపీలు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్..  తెలంగాణ ప్రజల హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం  కొన‌సాగిస్తామ‌ని అన్నారు. విభ‌జ‌న నేప‌థ్యంలో ప్ర‌స్తావించిన అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల‌కు పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు.  

Telangana: సోమ‌వారం బ‌డ్జెట్-2022 పార్ల‌మెంట్ స‌మావేశాలు (Parliament Budget session 2022) ప్రారంభం అయ్యాయి. అయితే, కేంద్రంలోని బీజేపీ స‌ర్కారును ఇర‌కాటంలో పెట్ట‌డానికి తెలంగాణ ఎంపీలు.. ముఖ్యంగా టీఆర్ఎస్ ఎంపీలు సిద్ధ‌మ‌య్యారు. పార్ల‌మెంట్ లో తెలంగాణ వాణిని బ‌లంగా వినిపించాల‌ని ఇప్ప‌టికే స‌న్న‌ద్దంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Kalvakuntla Taraka Rama Rao).. తెలంగాణ ప్రజల హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం కొన‌సాగిస్తామ‌ని అన్నారు. విభ‌జ‌న నేప‌థ్యంలో ప్ర‌స్తావించిన అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని రెండు తెలుగు రాష్ట్రాల‌కు పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని ఆయ‌న డిమాండ్ చేశారు. గడిచిన ఏడున్న‌ర సంవ‌త్స‌రాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సహాయ, సహకారాలు అందడం లేదని తెలిపారు. అయితే, తెలంగాణ‌కు ద‌క్కాల్సిన న్యాయ‌మైన హ‌క్కుల‌ను, నిధుల‌ను సాధించుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. 

హైదరాబాద్లో డ్రిల్ మెక్ కంపెనీతో జరిగిన ప్ర‌త్యేక ఒప్పంద కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న మాట్లాడుతూ.. పై వ్యాఖ్య‌లు చేశారు. పార్ల‌మెంట్ (Parliament Budget session 2022)లో ప్ర‌వేశ‌పెట్ట‌బోయే బ‌డ్జెట్-2022 లో ఆయినా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రాని స‌హ‌కారం అందించ‌కుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవ‌ద్ద‌ని అన్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న సంద‌ర్భంగా ప్ర‌స్తావించిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని పేర్కొన్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో ప్ర‌స్తావించిన విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల‌కు పారిశ్ర‌మ‌ల‌కు ప్రాధాన్యం క‌ల్పించే విధంగా.. ప్ర‌త్యేక పారిశ్రామిక రాయితీలు క‌ల్పించాల‌ని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపును కూడా కేటీఆర్ ప్ర‌స్తావించారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యప‌డుతుంద‌ని కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాల‌కు రావాల్సిన నిధుల‌ను విడుద‌ల చేయాల‌నీ, ప్ర‌త్యేక నిధులు సైతం చేటాయించాల‌ని పేర్కొన్నారు. 

ఈసారి పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్ట‌బోయే బడ్జెట్‌లోనైనా ఉమ్మ‌డి రాష్ట్ర విభజన హామీలు అమ‌లు చేసే విధంగా ముందుకు సాగాల‌ని కేంద్రాన్ని కోరారు. ముఖ్యంగా తెలంగాణలో పరిశ్రమలకు ప్రాధాన్యం క‌ల్పించాల‌ని అన్నారు. తెలంగాణ‌కు కేంద్ర స‌హ‌కారం అందించాల‌ని అన్నారు. దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఒక‌టిగా ఉన్న తెలంగాణకు కేంద్ర స‌హ‌కారం అదిస్తే.. మ‌రింత మెరుగైన అభివృద్ధిని సాధిస్తుంద‌నీ, పారిశ్రామికంగా కేంద్రం స‌హ‌కారం అందిస్తే.. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. అయితే, న్యాయమైన తమ హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం కొన‌సాగిస్తామ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణలో నిర్మించతలపెట్టిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, ఫార్మా సిటీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటికి రాలేదని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదే పదే సబ్ కా సాత్… సబ్ కా వికాస్ అంటున్నారని….రాష్ట్రాలకు నిధులు విధుల్చకపోతే సబ్ కా వికాస్ ఎలా సాధ్యమవుతుందని మంత్రి ప్రశ్నించారు. కాగా, డ్రిల్ మేక్ సంస్ధ తెలంగాణలో 10,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవ‌కాశముంది.