అగ్నిపథ్ శిక్షణలో బట్టలు ఉతకడం, హెయిర్ కట్, డ్రైవింగ్ నేర్పిస్తారన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు.
హైదరాబాద్ : హైదరాబాద్ నగరాభివృద్ధికి సూచిక రహదారులు, ప్రజా రవాణా వ్యవస్థలేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ ఎనిమిది ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం 30 ఫ్లైఓవర్లు నిర్మించిందని.. మరో 17 నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. కూకట్పల్లి పరిధిలోని కైతలాపూర్ వద్ద రూ. 84 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్ను ఆయన ప్రారంభించారు. ఆ తరువాత నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ఎస్ఆర్డీపీ ఫేజ్-1లో భాగంగా గా రూ. 8052 కోట్లతో 47 కార్యక్రమాలు చేపట్టామన్నారు. రూ. 3,115 కోట్లతో రెండో దశ ఎస్ఆర్డిపి మీ పనులు చేపట్టినట్లు తెలిపారు.
దేశంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ నేతలు కుల మతాల మధ్య పంచాయతీ పెడుతున్నారని ఆరోపించారు. అగ్నిపథ్ పేరుతో యువత పొట్ట కొడుతున్నారని ఆక్షేపించారు. అగ్నిపథ్ శిక్షణలో బట్టలు ఉతకడం, హెయిర్ కట్, డ్రైవింగ్ నేర్పిస్తారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారని.. అవి నేర్చుకునేందుకు దేశ యువత మిలటరీలో చేరాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశాన్ని రామరాజ్యం చేస్తామని చెప్పి.. రావణకాష్టం చేశారని ఆయన ఆరోపించారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో చర్చలు సఫలం.. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హామీతో ఆందోళన విరమణ..
ఇదిలా ఉండగా, జూన్ 17న అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ కు వ్యతిరేకంగా మీద దేశవ్యాప్తంగా చెలరేగుతులున్న నిరసనలు, హింసాత్మక ఘటనల మీద తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ స్పందించారు. ఈ నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయన్నారు. నిరుద్యుగం ఎంత తీవ్రంగా ఉందో ఈ ఘటనలు తెలుపుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మొదట రైతులతో ఆటలాడుకుందని.. ఇప్పుడు సైనికులతో ఆడుకుంటోందని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుండి ప్రతిపాదిత నో ర్యాంక్ - నో పెన్షన్ వరకు.. నిరుద్యోగులను.. సైనికులను మోసం చేస్తోందని దుయ్యబట్టారు.
ఇక, జూన్ 19న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రబుత్వానికి కేటాయించిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆదివారం నాడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లెటర్ రాశారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ , ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందని కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ ఆరు సంస్థలకు గతంలో సుమారు 7,200 ఎకరాల భూమిని రాష్టర సర్కారు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ధరల ప్రకారం ఈ భూముల విలువ కనీసం రూ. 5వేల కోట్లకు పైగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఈ ధర 40వేల కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మొద్దని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను మంత్రి కేటీఆర్ ఆ లేఖలో కోరారు.
