Asianet News TeluguAsianet News Telugu

అలా అయితే రాజకీయాల నుండి తప్పుకుంటా, బీఆర్ఎస్‌ను మూసేస్తారా: కేటీఆర్ కు కోమటిరెడ్డి సవాల్

బీఆర్ఎస్  నేత కేటీఆర్ కు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు.

Telangana Minister Komatireddy Venkat Reddy Challenges to KTR lns
Author
First Published Mar 1, 2024, 5:07 PM IST


హైదరాబాద్:  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారకరామారావుకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  సవాల్ విసిరారు.  శుక్రవారం నాడు  హైద్రాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  మీడియాతో  చిట్ చాట్ చేశారు.

also read:బీఆర్ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్

ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేద్దాం... సిరిసిల్ల నుండి పోటీ చేద్దామని  కేటీఆర్ ను కోరారు  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సిరిసిల్లలో కేటీఆర్ చేతిలో తాను ఓటమి పాలైతే  రాజకీయాల నుండి తప్పుకుంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు. ఒకవేళ తన చేతిలో కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ ను  మూసివేయాలని ఆయన  సవాల్ విసిరారు.

also read:నల్లమిల్లి, సత్తి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు: ఆనపర్తిలో ఉద్రిక్తత

కేటీఆర్ కు టెక్నికల్ నాలెడ్జ్ లేదన్నారు మంత్రి వెంకట్ రెడ్డి. కేటీఆర్ కు క్యారెక్టర్ లేదు, కానీ లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు.తనకు క్యారెక్టర్ ఉంది.. కానీ, తన వద్ద  దగ్గర డబ్బులు లేవని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు. కేటీఆర్ సిరిసిల్లలో  రూ. 200 కోట్లు ఖర్చు చేసి 30వేల తో గెలుస్తాడా అని ప్రశ్నించారు. తానైతే అలా గెలిస్తే రాజీనామా చేసేవాడినని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.

also read:జనసేనను చంద్రబాబు నిర్వీర్యం చేస్తారు: పవన్ కు హరిరామ జోగయ్య మరో లేఖ

మల్కాజిగిరి నుండి  పోటీ చేద్దామని  తెలంగాణ సీఎం కు  కేటీఆర్ రెండు రోజుల క్రితం సవాల్ విసిరిన విషయం తెలిసిందే.ఈ విషయమై  ఇవాళ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో  నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో  అవినీతిని బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది.  

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు  తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు.సిరిసిల్లలో పోటీ చేసి  తాను ఓడిపోతే  రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు.  తాను విజయం సాధిస్తే బీఆర్ఎస్ ను మూసివేస్తారా అని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కేటీఆర్ ను ప్రశ్నించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios