నల్లమిల్లి, సత్తి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు: ఆనపర్తిలో ఉద్రిక్తత
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఆనపర్తిలో ఇవాళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వేడేక్కింది.
కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ నేతల వెంట బహిరంగ చర్చకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎక్కడికక్కడే వారిని నిలువరించారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
also read:కారణమిదీ:మార్చి 2న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ప్రత్యేక లైవ్ ట్రేడింగ్
అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై చర్చకు సిద్దమని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. 109 అవినీతి అంశాలపై చర్చకు సిద్దమా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి చర్చిస్తానని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ప్రకటించారు.
also read:జనసేనను చంద్రబాబు నిర్వీర్యం చేస్తారు: పవన్ కు హరిరామ జోగయ్య మరో లేఖ
ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇంటికి బయలుదేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి నిరసనకు దిగారు.ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లకుండా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.
also read:రెండో జాబితాపై టీడీపీ-జనసేన కసరత్తు: సీనియర్లకు చోటు?
అయితే మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఆరోపణలపై ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తోసిపుచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.వచ్చే ఎన్నికల్లో అనపర్తిలో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధిస్తుందని అన్ని సర్వే నివేదికలు రావడంతో నిరాశతోనే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
also read:రోడ్డు పక్క టీ తాగిన బిల్ గేట్స్: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
బహిరంగ చర్చ పేరుతో రెండు పార్టీల నేతలు ఒకే ప్రాంతానికి చేరితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.