ఎప్పటికప్పుడు గెలుపులో తన మెజారిటీని తానే తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతున్న మంత్రి హరీష్ రావు..... తాజాగా పాల వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆయన నేరుగా కాకున్నప్పటికీ, ఆయన సతీమణి శ్రీనిత ఈ రంగంలోకి అడుగుపెట్టారు. 

మిల్చి మిల్క్ పేరుతో హరీష్ సతీమణి శ్రీనిత ఒక కొత్త పాల బ్రాండ్ ను లాంచ్ చేసారు. రోగ నిరోధక శక్తి అనేది ప్రతిఒక్కరికి అవసరమని, ఈ కరోనా వేళ  పాలు, పాలు ఉత్పత్తుల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. 

ప్రజల ఇంటివద్దకు స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను అందజేస్తామని, కఠినమైన నియంత్రణ చర్యలు చేపడుతున్నామని, నాణ్యత విషయంలో రాజి అనేదే లేదని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. 

ఇకపోతే రాజకీయంగా హరీష్ రావు దుబ్బాక మీద పూర్తి ఫోకస్ పెట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే గా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమయింది. అక్కడ ఏకగ్రీవం కాకుండా కాంగ్రెస్ బరిలో నిలవనున్న నేపథ్యంలో... ఆయన పూర్తి ఫోకస్ ను అటువైపుకు మార్చారు.