మంత్రి హరీశ్ రావు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన మాటను ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు హరీశ్ రావు చెప్పారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఈ రోజు సిద్ధిపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ పంట రుణమాఫీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, మంత్రి హరీశ్ రావు ఇదే ప్రస్తావన తెచ్చారు. నెలరోజుల్లోగా రైతులందరికీ రూ. 1 లక్ష సాగు రుణమాఫీ చేస్తామని అన్నారు.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి మంత్రి హరీశ్ రావు వెళ్లారు. అక్కడ రైతు వేదిక, బుడగ జంగాల కమ్యూనిటీ హాల్, గ్రామ పంచాయతీ భవనం, మహిళా మండలి భవన్ సహా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మహిళలకు స్త్రీనిధి చెక్కులను అందించారు. 

Also Read: ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. పంద్రాగస్టు స్పెషల్ ఇదే

సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు తెలంగాణలో పని కోసం ఎదురుచూసే కైకిలోళ్లు ఉండేవారని, ఇప్పుడు పనులు ఉన్నా.. కైకిలోళ్ల కోసం చూస్తున్నామని తెలిపారు.