తెలంగాణ మంత్రి హరీష్ రావు బిజెపి పాలనకు టీఆర్ఎస్ పాలనకు మధ్య తేడా ఏమిటో కర్ణాటక గ్రామస్తులకు వివరించారు. ఓ మహిళతో ఆయన సంభాషించారు.
ఒక మాస్ లీడర్ అయి ఉండి, అతను ప్రజల్లోకి వెళ్లగలిగితే అతనిచ్చే సందేశం కానీ, అతని ప్రసంగాలు కానీ ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో బలంగా వెళ్తాయి. దీనికి ఉదాహరణే 2014 లో నరేంద్ర మోడీ చేసిన ఎన్నికల ప్రచారం. ఒక మాస్ లీడర్ గా ఆకట్టుకునే ప్రసంగాలతో నరేంద్ర మోడీ ప్రజల్లోకి బలంగా వెళ్లగలిగాడు అందుకే ఇప్పటికీ అతని చరిష్మాను ప్రజల్లో తగ్గించుకోలేకపోతున్నాడు.
సరిగ్గా ఇలాంటి ఇమేజ్ ఉన్న నాయకుడే తెలంగాణ రాష్ట్రంలోని టిఆర్ఎస్ నేత హరీష్ రావు, ప్రజల నాడీ ఎక్కడ పట్టాలి, ఎలా మాట్లాడాలి అన్నది హరీష్ రావు వెన్నతో పెట్టిన విద్య. అందుకే తెలంగాణలో తన మామతో సమానంగా అభిమానుల్లో సంపాదించుకున్న నేతల్లో తెలంగాణలోనే రెండవ స్థానంలో ఉంటారు. ఇలాంటి నాయకుడు ప్రజల్లోకి వెళ్తే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి. అలాంటి సంఘటనే నిన్న హరీష్ రావు సంగారెడ్డి జిల్లా పర్యటన సందర్బంగా చోటు చేసుకుంది.
నిన్న సంగారెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళ్తూ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు బీదర్ దగ్గర ఒక గ్రామం వద్ద ఆగి రోడ్డు పక్కన ఏవో పొట్టకూటి పనులు చేసుకుంటున్న మహిళల వద్దకు వెళ్లి వాళ్ళను పలకరించాడు. వారి మధ్య సంభాషణ ఈ విధంగా సాగింది.
మంత్రి. - అమ్మా బాగున్నారా... ఎలా ఉన్నారు . మీది ఏ గ్రామం.
మహిళలు. - మాది కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా జాంబిగ గ్రామంలోని గామతండా వాసులం.
మంత్రి- మీకు పెన్షన్స్ ఇస్తోందా మీ ప్రభుత్వం ఎంత ఇస్తున్నారు.
మహిళలు - మా ప్రభుత్వం ఐదువందల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు.
మంత్రి - తెలంగాణ రాష్ట్రంలోని మీ పక్కనే ఉన్న నారాయణఖేడ్ లో పెన్షన్ ఎంత ఇస్తున్నారో తెలుసా.
మహిళలు- మా వాళ్లు అక్కడ ఉన్నారు సార్. రెండు వేల రూపాయలు ఇస్తున్నారు.
మంత్రి - విద్యుత్ ఎంత సేపు ఇస్తున్నారు.
రైతు - ఐదారు గంటలు కూడా రావడంలేదు. కరెంట్ వస్తూ పోతూ ఉంటుంది. నా ఐదేకరాల పంటకు నీరు పారాలంటే పది రోజులు పడుతుంది సార్.
మంత్రి - పక్కనే నారాయణ ఖేడ్ లో కరెంటు ఎలా ఉంది.
గ్రామస్థులు- సార్ పక్కనే తెలంగాణ గ్రామాలు మాకు కనిపిస్తనే ఉంటుంది. 24 గంటలు కరెంట్ వస్తోంది. మేం చూస్తూనే ఉన్నాం. మా బాధలు తెలుసుకునే వారే లేరు.
మంత్రి - అమ్మా ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ సందర్భంగా ప్రభుత్వసాయం ఏమైనా అందుతుందా...
మహిళలు - మాకేమీ ఇవ్వడంలేదు.
మంత్రి- మేం డెలివరీ సందర్భంగా కేసీఆర్ కిట్ అందజేస్తున్నాం.
మహిళలు- మీదగ్గర అన్నీ బాగా చేస్తున్నరు సార్.
మంత్రి - పెళ్లికి ఏమైనా సాయం చేస్తున్నరా..
మహిళలు- లేదు సార్ ఏదీ సాయం అందడం లేదు.
మంత్రి- నారాయణ ఖేడే లో పెళ్లికి సాయం అందుతుందా...
మహిళలు- మాకు తెలుసుసార్ , మా వాళ్లు ఉన్నారు. పెళ్లికి లక్ష రూపాయల సాయం అందుతోంది.
మంత్రి - మంచి నీటి సౌకర్యం అందుతుందా.. ? ఇంటింటికి తాగు నీరు ఇస్తున్నారా. ?
మహిళలు - కిలో మీటర్ దూరం నుండి ఇక్కడకు వచ్చి నీళ్లు పట్టుకుంటాం సర్. కరెంట్ వస్తే బిందలతో నీళ్లు తెచ్చుకుంటాం.
మంత్రి - వ్వవసాయానికి మీ ప్రభుత్వం సాయం చేస్తుందా. ?రైతు- మాకు ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు.
మంత్రి- మేం ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున, ఎన్ని ఎకరాలుంటే అన్ని ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం
అక్కడే ఆ మహిళలకు తెలంగాణ లోని టిఆర్ఎస్ ప్రభుత్వానికి, కర్ణాటక లోని బిజెపి ప్రభుత్వానికి తేడా ఏంటో, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందో అర్థమయ్యేలా చెప్పారు. అక్కడ జరిగిన ఈ సంభాషణ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఒక మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ ప్రజల్లోకి వెళ్తే ఎంత ప్రభావం ఉంటుందో అన్నదానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
