మేం జనంలో తిరుతున్నాం.. వాళ్లు ఏసీ గదుల్లో ఐసోలేషన్‌లో: ప్రతిపక్షాలపై హరీశ్ విసుర్లు

ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కష్టపడుతుంటే, ప్రతిపక్షాలు ఐసోలేషన్‌లో ఉన్నాయని హరీశ్ రావు సెటైర్లు వేశారు. దేశంలో ఏ రాష్ట్రం రైతుల నుంచి పంట కొనుగోలు చేయడం లేదని, కరోనా ప్రతికూల పరిస్ధితుల్లోనూ తాము రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు

Telangana minister harish rao slams congress over lockdown and farmers issue

ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. మెదక్ జిల్లా కుల్చారం మండలం రంగంపేటలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన రైతుల పక్షాన తాము పనిచేస్తుంటే, ప్రతిపక్షాలు ఏసీ గదుల్లో కూర్చొని విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.

ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కష్టపడుతుంటే, ప్రతిపక్షాలు ఐసోలేషన్‌లో ఉన్నాయని హరీశ్ రావు సెటైర్లు వేశారు. దేశంలో ఏ రాష్ట్రం రైతుల నుంచి పంట కొనుగోలు చేయడం లేదని, కరోనా ప్రతికూల పరిస్ధితుల్లోనూ తాము రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు.

Also Read:లాక్ డౌన్ ఎఫెక్ట్: తెలంగాణ గుళ్ళలో ఆన్ లైన్లో పూజ, ఎస్ఎంఎస్ ద్వారా ఆశీర్వాదం!

మద్దతు ధర చెల్లించి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు.

తాము రైతుల మధ్య, ప్రజల మధ్య తిరుగుతున్నామని... ప్రతిపక్షాలు హైదరాబాద్‌లో గాంధీభవన్‌లో, హైదరాబాద్‌లో కూర్చొన్నారని హరీశ్ దుయ్యబట్టారు. ఏసీ  రూంలలో కూర్చొని ప్రతిపక్షనేతలు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి సెటైర్లు వేశారు.

Also Read:హెల్త్ ప్రొఫైల్స్ ఆధారంగా విధులు: తెలంగాణ పోలీస్ శాఖ ప్లాన్

కరోనా సంక్షోభంలోనూ రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు కొంటున్నామని... ఎమ్మెల్యే, అధికారులు, ఐకేపీ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. కోవిడ్ 19 కారణంగా దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రం రైతుల నుంచి పంటలు కొనడం లేదని తెలిపారు.

కర్ణాటక ప్రభుత్వం శనగలు కొనుగోలు చేయకపోవడంతో బీదర్ రైతులు నారాయణ్ ఖేడ్, జహీరాబాద్‌‌కు తెచ్చి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు విమర్శలు, అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రాష్ట్రమంతా లాక్‌డౌన్ అమల్లో ఉన్నా... రైతులకు  మాత్రం లాక్‌డౌన్ లేదని హరీశ్ స్పష్టం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios