తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించే పోలీసులు, వైద్యులకు సైతం కోవిడ్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట పీఏకు కరోనా  సోకినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ బొంతు రామ్మోహన్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. మరోవైపు కారు డ్రైవర్ ఇవాళ ఉదయం నుంచి డ్యూటీలో ఉండటంతో అతనితో ఎవరెవరు కలిశారు.. తదితర వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. 

కొద్దిరోజుల క్రితం బొంతు రామ్మోహన్‌కు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇటీవల నగరంలోని ఓ టీ దుకాణంలో మేయర్ టీ తాగారు. అయితే టీ అమ్మే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో, ముందు జాగ్రత్తగా ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు.

Also Read:

బ్రేకింగ్: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా

ఉస్మానియా మెడికల్ కాలేజీ ల్యాబ్‌ డేటా ఆపరేటర్‌కి కరోనా: వ్యాపారి మృతి