ఎమ్మెల్యేల కొనుగోలు‌కు బీజేపీ కుట్ర: దుబ్బాకలో హరీష్ రావు

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే  కొనుగోలకు  కుట్ర పన్నుతుందని  తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు  ఆరోపించారు.  తెలంగాణ బీజేపీకి  30 సీట్లు కూడా  రావన్నారు. 

Telangana Minister Harish Rao  Serious Comments on BJP

దుబ్బాక:తెలంగాణలో  ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు బీజేపీ పాల్పడుతుందని  తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.   దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన  బహిరంగ సభలో  తెలంగాణ మంత్రి హరీస్ రావు మాట్లాడారు. తెలంగాణలో  30 సీట్లు కూడా  రావని ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్   అంటున్నారన్నారు. ఈ వ్యాఖ్యలను చూస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని   ఆ పార్టీ నేతలకు తెలిసిపోయిందన్నారు. అందుకే  ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర చేస్తున్నారన్నారు. 

ప్రతి విషయాన్ని వాడుకుని రాజకీయాలకు మలినం చేసిన చరిత్ర  బీజేపీదేనన్నారు. బీజేపీలో ఉంది చేరికల కమిటీ కాదు, పార్టీల చీలికల కమిటీ అని  ఆయన సెటైర్లు వేశారు. కేంద్రంలో  అధికారంలోకి రాగానే  తెలంగాణలోని ఏడు మండలాలను లాక్కొన్నారన్నారు. గ్యాస్, పెట్రో ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని చెప్పారు. ప్రజల ఆదాయం రెట్టింపు చేస్తామని  ఇచ్చిన హామీని  బీజేపీ నిలుపుకోలేదన్నారు. ప్రజలు రోజు ఉపయోగించే వస్తువుల ధరలను విపరీతంగా పెంచారని  ఆయన  మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని  కేంద్ర ప్రభుత్వం కారుచౌకగా  విక్రయిస్తుందన్నారు.   తెలంగాణ రాస్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు  బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. 

ప్రజలకు  సంక్షేమ పథకాలు అమలు చేయడం కేసీఆర్ వంతైతే, ధరలు పెంచి ప్రజల నడ్డి విరడం బీజేపీ నైజమన్నారు. దుబ్బాకలో  డయాలసిస్  సేవలను ప్రారంభించనున్నట్టుగా  హరీష్ రావు  చెప్పారు.బీజేపీ ప్రయోగాలు తెలంగాణతో పాటు  దక్షిణాది రాష్ట్రాల్లో  తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  తెలిపారు. 

also read:దుబ్బాక హబ్సిపూర్‌లో ఉద్రిక్తత: బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట

ఉందన్నారు. ఇందుకు  దుబ్బాకలో  రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న  అభివృద్ది కార్యక్రమాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దుబ్బాకకు అందం పెరిగే విధంగా ఇవాళ బస్టాండ్ ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు.  దుబ్బాక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడంలో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కృషి మరువలేనిదని ఆయన గుర్తు చేశారు. 

 దుబ్బాకలో బస్టాండ్, తిరుపతి బస్సు కోసం కష్టపడింది ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అయితే కొబ్బరికాయ కొట్టేందుకు వచ్చింది ఇంకోకరని  పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యేపై ఆయన విమర్శలు చేశారు. 
ఓట్ల కోసం బీజేపీ వాళ్లు ఏమైనా చేస్తారన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios