Asianet News TeluguAsianet News Telugu

కరోనా వ్యాక్సిన్ నిల్వలున్నా రాష్ట్రాలకు ఇవ్వడం లేదు: కేంద్రంపై హరీష్ రావు ఫైర్

కేంద్రం వద్ద కరోనా వ్యాక్సిన్ నిల్వలున్నా కూడా రాష్ట్రాలకు అందించడంలో కేంద్రం సరిగా అందించడం లేదని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.

Telangana minister Harish Rao fires on Union Government
Author
Hyderabad, First Published Jan 28, 2022, 1:16 PM IST

ఖమ్మం: corona వ్యాక్సిన్ నిల్వలు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు ఆరోపించారు.శుక్రవారం నాడు Khammam ఆసుపత్రిలో క్యాత్‌ల్యాబ్, ట్రామా కేర్ సెంటర్ ను మంత్రి Harish Rao ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. బూస్టర్ డోస్ సమయాన్ని 3 నెలలకు తగ్గించాలని కోరామన్నారు. 60 ఏళ్ల వారికే కాకుండా అందిరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని కోరారు.

ఈ విషయమై కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. ఇవాళ కేంద్ర మంత్రితో జరిగే సమావేశంలో ఈ విషయమై మరోసారి చర్చించనున్నట్టుగా హరీష్ రావు చెప్పారు. అభివృద్ది చెందిన దేశాల్లో బూస్టర్ డోస్ సమయాన్ని మూడు నుండి నాలుగు నెలలకు తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనాతో ప్రాణాపాయం లేదన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ వేసుకోవాలని మంత్రి హరీష్ రావు కోరారు.

కరోనా Vaccination లో Karimnagar జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రెండో స్థానంలో ఖమ్మం జిల్లా నిలిచిందని మంత్రి గుర్తు చేశారు. దక్షిణ భారత దేశంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసి కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకొన్న వారిలో మరణాల శాతం చాలా తక్కువగా ఉందని మంత్రి హరీష్ రావు చెప్పారు. వ్యాక్సిన్ వేసుకోని వారిలోనే కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

హైదరాబాద్ కు దూరంలో ఖమ్మం ఉంటుంది. ఇక్కడి ప్రజలకు ఉపయోగ పడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు.గుండె సంబంధ సమస్యలకు లక్షల్లో ఖర్చు అయ్యే చికిత్స ఇక్కడ ఉచితంగా అందనుందన్నారు.మంత్రి పువ్వాడ అజయ్ కోరిక మేరకు కీమో థెరపీ, రేడియో థెరపీ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి హరీష్ రావు.వచ్చే ఆర్థిక ఏడాదిలో ఎం అర్ ఐ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో 77,33,427 ఇండ్లల్లో జ్వర సర్వే చేశామన్నారు. జ్వర బాధితులకు  3,45,951 కిట్లను అందించామన్నారు.ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి జ్వర సర్వే లో పాల్గొనాలి. టెస్టింగ్, హోం ఐసోలేషన్ కిట్లకు కొదువ లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని విధాలా ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా చెప్పారు.

నిలోఫర్‌  తర్వాత ఖమ్మంలోనే తల్లిపాల నిల్వ కేంద్రం ఉందన్నారు. మధిర, సత్తుపల్లిలో వంద పడకల దవాఖానలు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖమ్మంలో ఎంఆర్‌ఐ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని మార్చురీలను ఆధునీకరించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు. ఖమ్మం మార్చురీని కూడా ఆధునీకరిస్తామన్నారు. హైదరాబాద్‌ తరహాలో ఖమ్మంలో కూడా బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని తెలిపారు.అన్ని జిల్లాల్లో కూడా కరోనా వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కోరారు
 

Follow Us:
Download App:
  • android
  • ios