Asianet News TeluguAsianet News Telugu

తిరుపతిలో గుత్తి, అనంతపురం వాళ్లు ఏం చెప్పారంటే.... ఏపీలో కరెంట్ కష్టాలపై హరీశ్ రావు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న కరెంట్ కష్టాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. తిరుపతి వెళ్లినప్పుడు గత్తి, అనంతపురం వాళ్లతో మాట్లాడానని ఆయన తెలిపారు. 

telangana minister harish rao comments on power cuts in ap
Author
First Published Sep 25, 2022, 3:55 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు పరోక్ష విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను తిరుపతి వెళ్లినప్పుడు కొందరినీ కలిశానని చెప్పారు. వాళ్లది గుత్తి, అనంతపురం అని చెప్పారని... మీ దగ్గర కరెంట్ ఎంత సేపు వుంటుందని అడిగానని హరీశ్ రావు తెలిపారు. ఉదయం 3 గంటలు, రాత్రి 4 గంటలు కరెంట్ వుంటుందని తనకు చెప్పారని మంత్రి చెప్పారు. మళ్లీ గంట గంటకి కరెంట్ పోతుందని తెలిపారని హరీశ్ రావు వెల్లడించారు. 

అంతకుముందు గురువారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను త్వరలో 5 వేలకు పెంచుతామన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు తమ ఎంబీబీఎస్‌ విద్య కోసం ఉక్రెయిన్‌, రష్యాలకు విదేశాలకు వెళ్లాలనే విధంగా ఒత్తిడి వాతావరణం తీసుకురాబోమని ఆయన తెలిపారు. వివిధ కళాశాలల్లో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 240 సీట్లు అదనంగా పెరిగాయని చెప్పారు. సిద్దిపేట మెడికల్ కళాశాల విద్యార్థులతో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలో ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను 840 నుంచి 2,840కి పెంచామన్నారు. మొత్తం 33 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రణాళిక సిద్ధం చేశారనీ, త్వరలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్య 5వేలు దాటనుందని ఆయన అన్నారు.

ALso Read:తెలంగాణలో మీ రాజకీయం నడవదు.. కుట్రలు ఆపితే బెటర్ : బీజేపీకి హరీశ్‌రావు చురకలు

“ఉక్రెయిన్, రష్యన్ విశ్వవిద్యాలయాలలో ఎంబీబీఎస్ చదువుతున్న భారతదేశానికి చెందిన వేలాది మంది విద్యార్థులు యుద్ధం కారణంగా తమ చదువును మధ్యలోనే ఆపుకోవలసి వచ్చింది. అయితే, ఇంటికి తిరిగి వచ్చిన విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోలేదు” అని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో తమ చదువును కొనసాగించేందుకు సహాయం చేస్తుందనీ, అయితే జాతీయ వైద్య మండలి తమ ప్రతిపాదనను ఆమోదించలేదని మంత్రి తెలిపారు.

తెలంగాణలో తగినన్ని సీట్లను సృష్టించబోతున్నందున భవిష్యత్తులో ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు. వివిధ కళాశాలల్లో ఈ ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 240 సీట్లు అదనంగా పెరిగాయని ఆరోగ్య మంత్రి తెలిపారు. సూపర్ స్పెషాలిటీలోనూ అదనపు సీట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవని చెప్పిన  మంత్రి.. తెలంగాణ రాష్ట్రం ఈ ఘనత సాధించడంలో ముందుంటుందని అన్నారు. దీంతో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు ఇక్కడి విద్యార్థులు మెడిసిన్ చదివే అవకాశాలు కల్పించాలనే లక్ష్యాలను సాధిస్తామని హరీశ్ రావు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios