తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు కరీంనగర్ జిల్లా అంటే అమితమైన ప్రేమ ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్ర బడ్జెట్ లో మానేర్ రివర్ ఫ్రంట్ కి వందకోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి మంత్రి పాలాభిషేకం చెసి కరీంనగర్ జిల్లా తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలంగాణ శాసనసభలో నిన్న(గురువారం) ప్రవేశబెట్టిన బడ్జెట్‌2020-21లో మానేర్ నది రివర్ ఫ్రంట్ లో బాగంగా వందకోట్లు కెటాయించినందుకు కరీంనగర్ చౌక్ వద్ద ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన టిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. 

read more  చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడ్ బండ.. అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు పాట..

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీస్సులతో కరీంనగర్ నగరం అభివృద్ధి లో పరుగులు పెడుతుందన్నారు. త్వరలోనే కరీంనగర్ రాష్ట్రంలోనే మూడవ అతిపెద్ద నగరంగా అవతరించనుందన్నారు. ఇప్పటికే మానేరు నదిలో కెసిఆర్ ఐలాండ్ నిర్మించుకున్నామని... ,ఇప్పుడు కెటాయించిన వందకోట్లతో మరింత సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతామని గంగుల అన్నారు.