Asianet News TeluguAsianet News Telugu

చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడ్ బండ.. అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు పాట..

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. 2021 - 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పాట పాడారు.

harish rao sings song on nalgonda fluoride in telangana assembly - bsb
Author
Hyderabad, First Published Mar 18, 2021, 1:50 PM IST

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. 2021 - 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన పాట పాడారు.

‘చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడ్ బండ.. బొక్కలొంకరబోయిన బతుకులా.. మన నల్లగొండ.. దు:ఖమెల్లాదీసేదెన్నాళ్లు’ ఇది నల్లగొండ తాగునీటి కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రాసిన పాటని మంత్రి చెప్పారు. 

ఆనాడు ఫ్లోరైడ్ దు:ఖంమీద ఆవేదనతో పాట రాసిన ఆయనే ఈనాడు  ఫ్లోరైడ్ పీడను శాశ్వతంగా తొలగించారన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఫ్లోరైడ్ పీడ అంతమైందని, కొత్తగా ఎవరూ ఫ్లోరోసిస్ బారిన పడడంలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ప్రకటించిందని హరీశ్ రావు అన్నారు. నల్లగొండ  ఫ్లోరైడ్ కష్టాలకు మిషన్ భగీరథ పథకం చరమగీతం పాడిందన్నారు. 

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎండాకాలం వస్తే మహిళలు కుండలు పట్టుకుని మైళ్ల దూరం నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ఆదిలాబాద్ ఆదివాసి ప్రాంతంలో జనం కలుషిత నీరు తగి డయేరియా కారణంగా మరణాల బారిన పడేవారని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తాగునీటి కష్టాలు తీర్చారన్నారు. ప్రభుత్వం పట్టుదలతో పనిచేసి మిషన్ భగీరథ పథకాన్ని వేగంగా పూర్తి చేసిందని, తద్వారా రాష్ట్రంలోని అన్ని అవసరాలకు శుద్ధి చేసిన సురక్షిత జలాలు ఇంటింటికీ నల్లాల ద్వారా అందుతున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios