నిర్మల్: జాతిపిత మహాత్మగాంధీ చూపిన అహింస, సత్యాగ్రహ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని స్పష్టం చేశారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. జాతిపిత మహాత్మా గాంధీ కన్న కలను సాకారం చేద్దామని సూచించారు. 

నిర్మల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన గాంధీజీ 150వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

గాంధీజీ చూపిన అహింస, సత్యాగ్రహ స్ఫూర్తి తోనే తెలంగాణ రాష్ట్ర సాధించినట్లు తెలిపారు. 

ప్లాస్టిక్ నియంత్ర‌ణ అంద‌రి భాద్య‌త‌ అని చెప్పుకొచ్చారు.  

శాంతి, అహింసే ఆయుధాలుగా బ్రిటిష్ వాళ్లతో పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మగాంధీ అని కొనియాడారు. గాంధీజీ చూపిన పోరాట మార్గం అంద‌రికీ ఆదర్శనీయ‌మ‌ని చెప్పుకొచ్చారు. భారతదేశ స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిన గొప్ప వ్యక్తి గాంధీజీ అన్నారు. 

సత్యం కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు అంటూ గాంధీ సేవలను కొనియాడారు. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందన్న గాంధీ ఆలోచనలతో రాష్ట్రంలో శాంతిభద్రతలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.  

మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. నిమ్మ రాజులు పాలించిన నిర్మల్ ప్ర‌శాంత‌కు మారుపేర‌ు అని చెప్పుకొచ్చారు.

ప్లాస్టిక్ వాడకం నుంచి ప్రజలను దూరం చేయటంతోపాటు పర్యావరణాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంటుందన్నారు. ప్లాస్టిక్ నియంత్ర‌ణకు అంద‌రూ స‌హాక‌రించాల‌ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు.