రేపు తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ.. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఆహ్వానం..

తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ రేపు జరగనున్న నేపథ్యంలో మలి దశ తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు బీఆర్ఎస్ పార్టీనుంచి పిలుపువచ్చింది.  
 

Telangana martyrs stupa Inauguration tomorrow, Invitation to Srikantachari's mother Shankaramma - bsb

హైదరాబాద్ : తెలంగాణ అమరవీరుడు  శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టిఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణ అమరవీరుల స్తూపం ఆవిష్కరణ రేపు జరగనున్న నేపథ్యంలో…అందులో పాల్గొనడానికి ఆమెకు పిలుపు వచ్చింది. దీంతో శంకరమ్మ తన సొంత ఊరు నుండి బయలుదేరి ఈరోజు హైదరాబాదుకు చేరుకోనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరవీరుల స్తూపం ఆవిష్కరణ సభలో ఆమె పాల్గొనే అవకాశం ఉంది. 

తెలంగాణ సాధన కోసం.. తొలి, మలి దశ ఉద్యమాల్లో  అసువులు బాసిన అమరులను నిత్యం తలుచుకోవడానికి.. వారికి ప్రతిరోజూ నివాళి అర్పించేలా.. వారి త్యాగాల స్ఫూర్తితో ముందుకు సాగేలా అమరవీరుల స్మారక స్తూపాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన సంగతి తెలిసిందే.  అద్భుతమైన డిజైన్తో రూపొందిన ఈ స్మారక చిహ్నం  దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరిరోజైనా జూన్ 22న  ఆవిష్కరణ జరగనుంది. ఈ స్మారక చిహ్నాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్  ప్రారంభించనున్నారు. 

తెలంగాణ అమరవీరులను స్మరించుకునేందుకు ఒక మంచి స్మారకాన్ని నిర్మించాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టి జ్వలించే జ్యోతి డిజైన్ ను ఫైనలైజ్ చేశారు.  టిఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్న ప్రదేశంలోనే ఈ  స్థూపాన్ని నిర్మించారు. గతంలో జలదృశ్యం ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు.  ఆ ప్రాంతంలోనే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉండేది.

ఢిల్లీలో ఎన్నికల అధికారులను కలిసిన గద్దర్.. కొత్త పార్టీ పేరు ప్రకటన..

 ఆ పార్టీ  కార్యాలయం వేదికగానే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఉవ్వెత్తిన సాగింది. వాటన్నింటికీ గుర్తుగానే అమరవీరుల చిహ్నం ఉండాలని.. ఆ ప్రాంతంలోనే నిర్మించారు.  జ్వలించే జ్యోతిలా కనిపించే అమరవీరుల స్తూపం దానికి ఎదురుగా అంబేద్కర్ సచివాలయం… తెలంగాణ  సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను  నిత్యం స్మరించుకుంటూ  ముందుకు సాగేలా  చేయాలని అకాంక్షించారు. 

ఈ అమరవీరుల స్తూపాన్ని మొత్తం 3.29 ఎకరాల్లో  నిర్మించారు.  ఇందులో ఆరు అంతస్తులు  ఉన్నాయి.  అండర్ గ్రౌండ్ లో రెండు ఫ్లోర్లు పైన నాలుగు ఫ్లోర్లు  ఉన్నాయి. 1,06,993చదరపు అడుగులతో బేస్మెంట్ - 2, ఇంతే విస్తీర్ణంతో నిర్మించిన బేస్మెంట్ వన్ లో పార్కింగ్  ఏర్పాటు చేశారు.  ఇందులో దాదాపు 400 వరకు కార్లను పార్కు చేసుకోవచ్చు.

గ్రౌండ్ ఫ్లోర్ 28,707 చదరపు అడుగులతో  నిర్మించారు. ఇందులో ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. దీంట్లో మొదటి అంతస్తులు తెలంగాణ ఉద్యమ ప్రస్థానం అమరుల ఫోటోలతో పాటు ఒక థియేటర్ను కూడా ఏర్పాటు చేశారు 100 మంది వరకు కూర్చుని చూసేలా ఈ థియేటర్ ఏర్పాటయింది.  దీంట్లో తెలంగాణ ఉద్యమ ప్రస్థానం రాష్ట్ర సాధన కోసం జరిగిన రాజకీయ ప్రక్రియతో పాటు తెలంగాణ ప్రగతిని చూపే విధంగా 25 నిమిషాల నిడివి గల ఒక వీడియోను రూపొందించారు. ఈ వీడియోను వచ్చిన సందర్శనకులకు చూపిస్తారు.

ఇక రెండో అంతస్తులు 600 మంది కూర్చునే విధంగా 16964 చదరపు అడుగుల్లో ఒక పెద్ద హాలు నిర్మించారు. మూడో అంతస్తులో 8095  చదరపు అడుగుల్లో,  నాలుగో అంతస్తు 5900 చదరపు అడుగుల నిర్మాణం ఇది. అంతస్తులు ఓపెన్ రెస్టారెంట్ గ్లాస్ రూమ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు మొత్తం అమరుల స్మారక చేసిన నిర్మాణాన్ని 288461 చదరపు అడుగుల్లో చేపట్టారు. 

ఇక గురువారం జూన్ 22న సాయంత్రం 5 గంటలకు 6000 మందితో అంబేద్కర్ విగ్రహం నుంచి భారీ ర్యాలీ ఉంటుంది.  సాయంత్రం ఆరున్నర గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమరుల స్మారకం వద్దకు చేరుకుంటారు.  అమరులకు పోలీస్ గన్ సెల్యూట్ చేసిన తర్వాత అమర జ్యోతిని ప్రారంభిస్తారు.పక్కనే ఏర్పాటు చేసిన సభాస్తదిలో పదివేల మంది దీపాలతో అమరులకు నివాళులు అర్పిస్తారు. కేసీఆర్ ప్రసంగం తర్వాత 800 డ్రోన్లతో అమరులకు నివాళి తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రదర్శిస్తారు. పూర్తిగా స్టీల్ స్ట్రక్చర్ తో నిర్మించిన ఈ నిర్మాణానికి రూ.180కోట్లు ఖర్చు అయ్యాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios