ఢిల్లీలో ఎన్నికల అధికారులను కలిసిన గద్దర్.. కొత్త పార్టీ పేరు ప్రకటన..

ప్రజాయుద్ధనౌక గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే గద్దర్  బుధవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు. 

Telugu balladeer Gaddar meets election official in delhi then announce his party name as Gaddar Praja Party ksm

ప్రజాయుద్ధనౌక గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేశారు. కొత్త రాజకీయ పార్టీ దిశగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే గద్దర్  బుధవారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు. రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులను గద్దర్ కలిశారు. అనంతరం గద్దర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గద్దర్ ప్రజా పార్టీ’’ పేరుతో పార్టీని ఏర్పాటు చేసేందుకు ఢిల్లీకి వచ్చినట్టుగా చెప్పారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులకు అప్లికేషన్‌ ఇవ్వడం జరిగిందన్నారు. 

ఇది ప్రజల కోసం ఏర్పాటు  చేస్తున్న పార్టీ అని గద్దర్ చెప్పారు. భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడవాలని అన్నారు. తాను పార్లమెంటరీ మార్గంలోకి వచ్చానని.. ఓట్ల యుద్దంలోకి దిగానని  చెప్పారు. తాను ఏర్పాటు చేస్తున్న గద్దర్ ప్రజా పార్టీ ఒక తెలంగాణదే  కాదని.. దేశంలోని ఒక పార్టీగా నిర్మాణం చేసేందుకు తాను బుద్దుడిలా కృషి చేస్తానని తెలిపారు. 

ఇక, గద్దర్ ప్రజా పార్టీ జెండాను మూడు రంగులతో రూపొందించినట్లు తెలుస్తోంది. అందులో ఎరుపు, నీలి, ఆకుపచ్చ ఉండనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాగే జెండా మధ్యలో పిడికిలి గుర్తును పెట్టారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios