ఖమ్మం, మెదక్‌లలో పలించిన వ్యూహాం: నల్గొండలో చతికిలపడిన కాంగ్రెస్

ఖమ్మం మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాం ఫలించింది. నల్గొండలో మాత్రం  ఆ పార్టీకి దక్కాల్సిన ఓట్లు దక్కలేదు. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఓట్లు క్రాస్ అయ్యాయి. మెదక్, ఖమ్మం జిల్లాల్లో ప్రత్యర్ధి పార్టీల నుండి కాంగ్రెస్ కు ఓట్లు దక్కాయి.

Telangana Local Body MlC Election Results:Congress Gets Votes other parties From Khammam and Medak

హైదరాబాద్: ఖమ్మం, మెదక్ జిల్లాల్లో  కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్ధులకు సవాల్ విసిరింది. ఈ రెండు జిల్లాల్లో ప్రత్యర్ధి పార్టీల నుండి Congress పార్టీ అభ్యర్ధులకు క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈ స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్ధులకు ప్రత్యర్ధుల నుండి క్రాస్ ఓటింగ్ రూపంలో ఓట్లు కలిసి వచ్చాయి. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్ధితో పాటు అధికార Trs కు కాంగ్రెస్ పార్టీ నుండి ఓట్లు పోలయ్యాయి.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనుసరించిన వ్యూహాం Khammam జిల్లాలో ఆ పార్టీకి మెరుగైన ఓట్లు వచ్చేలా చేసింది. సీఎల్పీ నేత Mallu bhatti Vikramarka అనుసరించిన వ్యూఁహాం  ఆ పార్టీకి కలిసి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు 116 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించి టీఆర్ఎస్ లో చేరిన వారితో ఆ పార్టీ బలం 96కి పడిపోయింది. అయితే ఖమ్మం స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి రాయల నాగేశ్వర రావుకి 242 ఓట్లు దక్కాయి. టీఆర్ఎస్  నుండి పెద్ద ఎత్తున  కాంగ్రెస్ కు ఓట్లు క్రాస్ అయ్యాయి. అయితే టీఆర్ఎస్ అభ్యర్ధికి రావాల్సిన మెజారిటీ రాలేదు. అంతిమంగా టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధుకు 480 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి రాయల నాగేశ్వర్ రావుకి 242 ఓట్లు  వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. క్రాస్ ఓటింగ్ పై టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. Telangana Local body Mlc election నోటిఫికేషన్ విడుదలైన రోజు నుండి  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  ఖమ్మంలోనే మకాం వేసి తన వ్యూహాన్ని అమలు చేశారు. ఈ వ్యూహాం కలిసి వచ్చింది.

also read:ఛాలెంజ్ నిలుపుకొన్న జగ్గారెడ్డి: ప్రత్యర్ధులపై పైచేయి

ఇక మెదక్ జిల్లాలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అనుసరించిన వ్యూహాం కూడ కలిసి వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కు 230 ఓట్లున్నాయి. అయితే ఈ ఓట్లన్నీ తమ పార్టీ అభ్యర్ధి నిర్మలా జగ్గారెడ్డికి దక్కకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. అయితే జగ్గారెడ్డి సతీమణి నిర్మలకు  238 ఓట్లు దక్కాయి.  ఎన్నికల ముందు ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్ లో జగ్గారెడ్డి గెలుపొందారు. ప్రత్యర్ధి పార్టీల నుండి తమ పార్టీ అభ్యర్ధికి ఓట్లు రాబట్టుకొనేలా జగ్గారెడ్డి వ్యూహాం  ఫలించింది.ఇక కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న నల్గొండ జిల్లాలో ఆ పార్టీ నాయకత్వం ఈ ఎన్నికలను సరిగా పట్టించుకోలేదని తేలింది. ఈ జిల్లాలో కాంగ్రెస్  కు 384 ఓట్లున్నాయి.ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని బరిలొకి దింపలేదు. ఇండిపెండెంట్ అభ్యర్ధి నగేష్ కు ఆ పార్టీ మద్దతును ప్రకటించింది. నగేష్ కు 226 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుండి అధికార టీఆర్ఎస్ అభ్యర్ధి కోటిరెడ్డికి 150కి పైగా కాంగ్రెస్ పార్టీ నుండి  ఓట్లు క్రాస్ అయ్యాయి.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios