ఛాలెంజ్ నిలుపుకొన్న జగ్గారెడ్డి: ప్రత్యర్ధులపై పైచేయి

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన చాలెంజ్ ను నిలుపుకొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓట్లు తమకు దక్కకపోతే రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. 238 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్ధి  జగ్గారెడ్డి తన పట్టును నిలుపుకొన్నారు.

TPCC  Working President Jagga Reddy  wins his Challenge

మెదక్:Tpcc వర్కింగ్ ప్రెసిడెంట్  Jagga Reddy తన చాలెంజ్ ను నిలుపుకొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓట్లను  రాబట్టుకొంటామని చెప్పారు.తమ పార్టీ ఓట్లను తమ అభ్యర్ధికి రాకపోతే రాజీనామా చేస్తామని సవాల్ చేశారు. ఈ సవాల్ లో జగ్గారెడ్డి విజయం సాధించారు. medak జిల్లా Local body Mlc ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి Nirmala జగ్గారెడ్డికి 238 ఓట్లు దక్కాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్ధిగా తన భార్య నిర్మలను బరిలోకి దింపాడు జగ్గారెడ్డి. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు.  సుమారు వెయ్యికి పైగా ఓట్లున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి కేవలం 230 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే తమ పార్టీకి ఉన్న ఓట్లు తమ పార్టీ అభ్యర్ధి నిర్మలా జగ్గారెడ్డికి  పడకపోతే తాను రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు.

also read:Telangana Local Body mlc Election Results: ఆరు స్థానాల్లో టీఆర్ఎస్‌దే విజయం, ప్రభావం చూపని విపక్షాలు

ఉమ్మడి మెదక్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి యాదవ్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఈ స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న 230 ఓట్ల కంటే అదనంగా ఎనిమిది ఓట్లు ఆ పార్టీకి దక్కాయి.ఈ జిల్లాలో బీజేపీకి సుమారు 50కిపైగా ఓట్లున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి పడిన ఓట్లు టీఆర్ఎస్ పార్టీవా, లేక బీజేపీ నుండి క్రాస్ ఓటింగ్ జరిగిందా అనే విషయం తేలాల్సి ఉంది.ఎన్నికల ముందు తాను చేసిన సవాల్ లో విజయం సాధించారు. అంతేకాదు తమకు ఉన్న ఓట్ల కంటే అదనపు ఓట్లు దక్కించుకొని ప్రత్యర్ధులపై రాజకీయంగా పై చేయి సాధించారు.  రాష్ట్రంలోని 12 ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రరెడ్డి, శంభీపూర్ రాజు, నిజామాబాద్ నుండి కవిత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డి, వరంగల్ జిల్లా నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లోని ఒక్కొక్క స్థానానికి, కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాలకు ఎన్నికలు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపును ఇవాళ నిర్వహించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios