తెలంగాణలో మోడీ టూర్: ఏడో దఫా కేసీఆర్ దూరం

ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వరుసగా ఏడో దఫా దూరంగా ఉన్నారు. 

 Telangana KCR  skips receiving PM Modi Seventh Time lns

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికే కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడో దఫా కూడ దూరమయ్యారు. ఆదివారంనాడు మహాబూబ్ నగర్ లో  నిర్వహించే  పాలమూరు ప్రజా గర్జన కార్యక్రమంతో పాటు పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో  ప్రధాని మోడీ  పాల్గొననున్నారు.  ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని  ఆదివారం నాడు మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీ  శంషాబాద్ ఎయిర్ పోర్టుకు  చేరుకున్నారు.  ప్రధాని మోడీకి స్వాగతం పలికే  కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రధాని మోడీ  స్వాగతం పలికే కార్యక్రమానికి  కేసీఆర్ ఆరో దఫా దూరంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రధాని మోడీకి స్వాగతం పలికారు.2022 ఫిబ్రవరి నుండి ఇప్పటివకు  ఏడు దఫాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆరు దఫాలు  తెలంగాణ పర్యటనకు వచ్చారు.  అయితే ఈ ఆరు దఫాలు కూడ ప్రధానికి స్వాగతం పలికే కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు. 

2022 ఫిబ్రవరిలో  శంషాబాద్ కు సమీపంలోని ముచ్చింతల్ లో సమతామూర్తి విగ్రహావిష్కరణకు మోడీ హైద్రాబాద్ వచ్చారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు మోడీ వచ్చిన సమయంలో  కేసీఆర్ ఆయనకు ఆహ్వానం పలికే కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. 2022 మే 26న హైద్రాబాద్ లో  ఐఎస్‌బీ లో జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ  వచ్చారు అయితే  అదే రోజున  బెంగుళూరులో  జేడీఎస్‌ నేతలతో చర్చల కోసం కేసీఆర్ వెళ్లారు.  

2022 జూలై 1వ తేదీ నుండి  మూడో తేదీ వరకు  హైద్రాబాద్ లో  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు.  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైద్రాబాద్ కు వచ్చిన మోడీకి  స్వాగతం పలికే కార్యక్రమానికి కేసీఆర్ గైర్హాజరయ్యారు. అదే సమయంలో  రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధిగా  ఉన్న యశ్వంత్ సిన్హాకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. మోడీపై  కేసీఆర్ విమర్శలు చేశారు.

2022 నవంబర్ 12న రామగుండంలో  ఆర్ఎఫ్‌సీఎల్ ప్రారంభోత్సవానికి  మోడీ వచ్చారు.  ఈ సమయంలో కూడ  కేసీఆర్ ప్రధాని టూర్ కు దూరంగా ఉన్నారు.2023ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన  ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ కు వచ్చారు. సికింద్రాబాద్ నుండి తిరుపతికి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు  ప్రారంభోత్సవం, సికింద్రాబాద్ రైల్వే ఆధునీకీకరణ కార్యక్రమాల్లో మోడీ పాల్గొన్నారు.  హైద్రాబాద్ లో ఉండి కూడ ఈ కార్యక్రమానికి  కేసీఆర్ దూరంగా ఉన్నారు.మరో వైపు  2023 జూలై 8న  వరంగల్ లో మోడీ పర్యటించారు.  మోడీకి స్వాగతం పలికే కార్యక్రమానికి  సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. 

also read:హైద్రాబాద్‌కు చేరుకున్న మోడీ:ప్రత్యేక హెలికాప్టర్‌లో మహాబూబ్‌నగర్ కు

అయితే  గతంలో  ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్  తయారీ ప్రక్రియను పరిశీలించేందుకు  హైద్రాబాద్ వచ్చిన సమయంలో  సీఎం ను రావొద్దని పీఎంఓ నుండి సమాచారం అందిందని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు. 2020 నవంబర్ 28న  హైద్రాబాద్ కు వచ్చిన సమయంలో  మోడీ ప్రోటోకాల్ ను విస్మరించారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఆ తర్వాత ప్రధాని తెలంగాణలో పర్యటించిన సమయంలో  కేసీఆర్  దూరంగా ఉండడంపై బీజేపీ నేతలు కూడ కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ విషయమై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుంది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios