హైద్రాబాద్‌కు చేరుకున్న మోడీ:ప్రత్యేక హెలికాప్టర్‌లో మహాబూబ్‌నగర్ కు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.  

Prime Minister Narendra Modi  Reaches To Hyderabad lns

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారంనాడు మధ్యాహ్నం  శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్,తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ,పలువురు అధికారులు స్వాగతం పలికారు. 

ఇవాళ మధ్యాహ్నం 01:05 గంటలకు హైద్రాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సి ఉంది. అయితే  మధ్యాహ్నం 01:30 గంటలకు ప్రధాని చేరుకుంటారని సమాచారం అందింది. అయితే  మధ్యాహ్నం 01:40 గంటలకు  ప్రధాని మోడీ శంషాబాద్ కు చేరుకున్నారు.  శంషాబాద్ విమానాశ్రయం నుండి  01:47 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ   మహాబూబ్ నగర్ కు బయలు దేరారు. 

శంషాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రధాని  మహబూబ్ నగర్ కు బయలుదేరారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా  రూ. 13, 500 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. అనంతరం  మహాబూబ్ నగర్ లో నిర్వహించే  బీజేపీ సభలో  ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. పాలమూరు నుండి  ప్రధాని మోడీ  ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. 

also read:మీ వాగ్ధానాలు ఏమయ్యాయి:హైద్రాబాద్‌లో మోడీకి వ్యతిరేక పోస్టర్లు (వీడియో)

నిన్ననే  తెలంగాణలో పర్యటన గురించి సోషల్ మీడియా వేదికగా  మోడీ  వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై  మోడీ విమర్శలు గుప్పించారు.  ఇవాళ మహబూబ్ నగర్ లో  నిర్వహించే సభలో  ప్రధాని మోడీ ఏ రకమైన విమర్శలు చేస్తారోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా  చూస్తున్నారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని విషయంతో పాటు కృష్ణా జలాల్లో  వాటా తేల్చడంలో  కేంద్రం మీనమేషాలు లెక్కిస్తుందని కూడ  బీఆర్ఎస్ సర్కార్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.ఈ విషయమై  మోడీ ఏ రకమైన కౌంటర్ ఇస్తారో చూడాలి. మరో వైపు ప్రధాని మోడీ టూర్ కు  కేసీఆర్ మరోసారి దూరంగా ఉన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ప్రధాని మోడీకి స్వాగతం పలికారు.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios