Asianet News TeluguAsianet News Telugu

చర్చలు విఫలం: లిఖిత పూర్వక హామీ ఇవ్వాల్సిందే.. అప్పుడే విధుల్లోకి, తేల్చి చెప్పిన జూడాలు

తెలంగాణ డీఎంఈ రమేశ్ రెడ్డితో జూడాల చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ రాలేదని జూనియర్ డాక్టర్లు తెలిపారు. రాతపూర్వక హామీ ఇస్తేనే విధుల్లో చేరుతామని వారు తేల్చి చెప్పారు. విధుల్లో చేరే అంశంపై చర్చిస్తున్నామని  జూడాలు వెల్లడించారు.

telangana junior doctors not satisfied with govt promises will go for strike ksp
Author
Hyderabad, First Published May 26, 2021, 9:35 PM IST

తెలంగాణ డీఎంఈ రమేశ్ రెడ్డితో జూడాల చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ రాలేదని జూనియర్ డాక్టర్లు తెలిపారు. రాతపూర్వక హామీ ఇస్తేనే విధుల్లో చేరుతామని వారు తేల్చి చెప్పారు. విధుల్లో చేరే అంశంపై చర్చిస్తున్నామని  జూడాలు వెల్లడించారు. కరోనాతో చనిపోతే ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేమని డీఎంఈ చెప్పారని... 10 శాతం కోవిడ్ ఇన్సెంటివ్‌లు ఇవ్వడం కూడా కుదరదన్నారని జూనియర్ డాక్టర్లు మీడియాకు వివరించారు. 

అంతకుముందు సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  జూడాలు విధులు బహిష్కరించడంపై ఆయన స్పందించారు.జూనియర్ డాక్టర్ల సమ్మెపై సీఎం కేసీఆర్ బుధవారం నాడు ఉన్నతాధికారులతో చర్చించారు. జూనియర్ డాక్టర్ల సమస్యలు న్యాయమైతే  ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే  వాటిని పరిష్కరిస్తామన్నారు. కానీ ఇలాంటి సమయంలో సమ్మెకు దిగడం సరైంది కాదన్నారు. నిమ్స్ లో వైద్యుల కుటుంబసభ్యులకు చికిత్స అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని  ఆయన అధికారులను ఆదేశించారు. 

Also Read:సమ్మెను విరమించకపోతే చర్యలు తప్పవు: జూడాలకు కేటీఆర్ హెచ్చరిక

జూడాలు వెంటనే విధుల్లో చేరాలని సీఎం కోరారు. సమ్మె పేరుతో విధులు బహిష్కరించడం సరైంది కాదన్నారు.  సీనియర్ ప్రెసిడెంట్ల గౌరవ వేతనం 15 శాతం పెంచిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. జూనియర్ డాక్టర్లకు, వారి కుటుంబసభ్యులకు నిమ్స్ లో వైద్యం అందిస్తున్నట్టుగా సీఎం తెలిపారు. ఈ సమయంలో  సమ్మె చేయడాన్ని ప్రజలు కూడ హర్షించరని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. జూడాలను ప్రభుత్వం ఏనాడూ కూడ చిన్నచూపు చూడలేదన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios