వెయ్యికి వెయ్యి శాతం బాబుమోహన్ నాన్ లోకలే

telangana journalist kranthi kiran counter attak on babumohan
Highlights

  • నా తండ్రి కాళ్లెందుకు పట్టుకున్నావు
  • ఉద్యమంలో లేని బాబుమోహన్ ను విమర్శించే అర్హత అందరికి ఉంది
  • నేను ఏమనకముందే ఎందుకంత ఉలిక్కి పడుతున్నారు?

ఆందోళ్ ఎమ్మెల్యే బాబుమోహన్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ నేత క్రాంతి కిరణ్ స్పదించారు. బాబుమోహన్ చేసిన కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాబుమోహన్ వ్యాఖ్యలను ఖండిస్తూ క్రాంతి ఒక ప్రకటన వెలువరించారు. బాబుమోహన్ కామెంట్స్ కు క్రాంతి ఇచ్చిన సమాధానాలను యదావిదిగా ప్రచురిస్తున్నాం.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టి ఆర్ ఎస్ పార్టీలో చేరిన బాబుమోన్ గారికి నా నమస్కారాలు.  మీడియాతో  మీరు నా గురించి చర్చించిన విషయాలపై కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత నామీద ఉంది కాబట్టి స్పందిస్తున్నాను. మీ ప్రతి మాటకు జవాబు చెబుతున్నాను.

1 బాబుమోహన్ : ఆందోళ్ నియోజకవర్గం లో 24 ఏళ్ల నుంచి పని చేస్తున్నా.

క్రాంతి : అవును నేను కాదనలేను.

 

2 బాబుమోహన్ : మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను.

క్రాంతి : అది కూడా వాస్తవమే. కాదని నేనేమీ చెప్పలేదు.

 

3 బాబుమోహన్ : ఆందోళ్ నియోజకవర్గం మొత్తం నా కంట్రోల్ లో ఉంది.

క్రాంతి : మీరు ఎమ్ ఎల్ ఏ కదా తప్పదు.

 

4 బాబు : కొద్ది మంది నన్ను నాన్ లోకల్ అని అనడం సరి కాదు.

క్రాంతి : వెయ్యి కి వెయ్యి శాతం మీరు నాన్ లోకల్.

 

5 బాబు : అమెరికాలో‌నాలుగేళ్లు ఉంటేనే గ్రీన్ కార్డు ఇస్తారు‌.

క్రాంతి : అది అమెరికా.. ఇది ఆందోల్ తేడా లేదా?

 

6 బాబు : ఆందోళ్ లో నాన్ లోకల్ అని విమర్శించే వ్యక్తి పార్టీలో ఎప్పుడు ‌చేరారో...

క్రాంతి : తెలంగాణ ఉద్యమంలో లేని మిమ్మల్ని విమర్శించే అర్హత ప్రతి తెలంగాణ వాదికి ఉన్నట్టే నాకు ఉంది. పార్టీ లో ఉన్నది లేనిది నేను చెప్పినానా?

 

7 బాబు : అతనికి సభ్యత్వం ఇవ్వాల్సింది నేనే కదా?

క్రాంతి : రక్తం చిందించిన కార్యకర్తలకు నీవు సభ్యత్వం నిరాకరిస్తే .. పెద్దల సహాయంతో వాళ్ళు సభ్యత్వం పొందారు. అది నియోజకవర్గం లో అందరికి తెలుసు.

 

8 నన్ను లోకల్ అనే విమర్శించే వ్యక్తి కి వారి ఇంట్లో వాళ్లే‌ ఓట్లు వేయరు.

క్రాంతి : అది ఎన్నికల్లో చూద్దాం.. మరి మా ఊరుకొచ్చి మా తండ్రి కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

 

9 బాబు : వాళ్ల నాన్నకు స్వగ్రామం లో‌ నేనే రిస్క్ తీసుకుని పోస్టింగ్ ఇప్పించా..

క్రాంతి : మా నాన్న మా ఊర్లో ఏనాడు పోస్టింగ్ చేయలేదు. అయినా మా నాన్న చేసిన సేవకు మీరు ఏం చేసినా తక్కువే.

 

10 బాబు : గత ఎన్నికల్లో సోనియా ప్రచారం చేసిన ఊరిలోనే 80, శాతం ఓట్లు సాధించి గెలిచా.

క్రాంతి : అది మీ గొప్పతనంతో తెచ్చుకున్నది కాదు.. కెసిఆర్ మూలంగా అక్కడి కార్యకర్తల మూలంగా వచ్చాయి, మెం గర్వాంగా చెబుతాం అందులో మా పాత్ర కూడా వుంది.

 

అయినా పెద్దాయనా.. నిన్ను నేనేమైనా విమర్శించానా? స్థానికుడికే కాదు నాకు కూడా అవకాశం ఇస్తే పోటీ చేస్తాను అన్నాను. దానికి మీరెందుకు అంతగా ఉలికిపడుతున్నారు. ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా విమర్శిస్తే నాగురించి మాట్లాడితే బాగుండేది. అంతే కాని పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మానుకుంటే మంచిది. అది మీకు మంచిది కాదు.. అక్కడి కార్యకర్తలకు మంచిది కాదు.

loader