తెలంగాణ లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచేందుకు జనసేన సిద్ధం అయింది.ఇండిపెండెంట్లుగా పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు,కార్యకర్తలకు సూచించారు

Alo read:మున్సిపల్ పోల్స్: 'చేయి' చాచిన రాని సైకిల్, లెఫ్ట్

కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో పార్టీ పరంగా గ్లాస్ గుర్తుతో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.

పోటీ చేయాలని ఆసక్తి ఉన్న పార్టీ కార్యకర్తలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయడానికి  పవన్ కళ్యాణ్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికలలో పోటీ చేసి కార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుందని  ఆయన వెల్లడించారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తెలంగాణలో పలు పార్లమెంట్ స్థానాల్లో  పోటీ చేసింది. స్థానిక ఎన్నికలకు దూరంగా ఉన్నా  పురపాలక ఎన్నికలు రావడంతో మున్సిపల్ పట్టణాలలో జనసేన రంగంలోకి దిగేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

పవన్ ఫ్యాన్స్ ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే  ఉండడంతో ఇతర స్వతంత్రులుగా బరిలో నిలిచే జనసేన అభ్యర్థులతో ఇతర పార్టీలపై   జనసేన అభ్యర్థుల ప్రభావం కనిపించే అవకాశం ఉంటుందని ఆందోళన విపక్ష పార్టీలో వ్యక్తమవుతోందిస్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడంతో పవన్ ఫ్యాన్స్ లో కొంత నిరాశ కూడా కనిపిస్తోంది.