Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ: గేటెడ్ కమ్యూనిటీల్లోనూ వ్యాక్సినేషన్.. ప్రత్యేకంగా యాప్

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోందన్నారు తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌

telangana it secretary jayesh ranjan launched ufrwa app for vaccination drive ksp
Author
Hyderabad, First Published Jun 6, 2021, 5:15 PM IST

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోందన్నారు తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ . అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కోసం యునైటెడ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (యూఎఫ్‌ఆర్‌డబ్ల్యూఏ) ఆధ్వర్యంలో రూపొందించిన యాప్‌ను ఆయన ఆదివారం వర్చువల్‌గా ఆవిష్కరించారు.  

Also Read:ఈ నెల 8న తెలంగాణ కేబినెట్ భేటీ: లాక్‌డౌన్‌పై చర్చ 

ఈ సందర్భంగా జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉందని.. జులైలో దాన్ని అధిగమిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్స్‌ కోసం భారత్‌ బయోటెక్‌ ఈనెలలో 4 లక్షల డోసులు రాష్ట్రానికి ఇచ్చేందుకు సమ్మితించిందని చెప్పారు. ఆస్పత్రులు కూడా ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని జయేశ్ రంజన్ వెల్లడించారు. 500 గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు ఆసక్తి చూపినట్లు నిర్వాహకులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios