Asianet News TeluguAsianet News Telugu

ఈ నె 8న తెలంగాణ కేబినెట్ భేటీ: లాక్‌డౌన్‌పై చర్చ

తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నారు.  లాక్‌డౌన్ పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొంటారు.  గతంలో నిర్వహించిన సమావేశంలో లాక్‌డౌన్ ను పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. 

Telangana cabinet meeting will be held on june 8 lns
Author
hyderabad, First Published Jun 6, 2021, 1:40 PM IST


హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నారు.  లాక్‌డౌన్ పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొంటారు.  గతంలో నిర్వహించిన సమావేశంలో లాక్‌డౌన్ ను పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని కరోనా స్థితిగతులు,ఇరిగేషన్., రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితరఅంశాల మీద కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.రాష్ట్రంలో  ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా ప్రాజెక్టుల పనుల పురోగతి చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు తదితర అంశాల మీద  సమీక్ష నిర్వహిస్తారు.

వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో, పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందుతున్న విషయం పై చర్చించనున్నారు. కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల కారణంగా రెండవ వేవ్ కరోనా తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో ఇంకా కూడా శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి .  థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో థర్డ్ వేవ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు రాష్ట్ర వైద్యశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తారు.కరోనా కట్టడికోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో, దాని పర్యవసానంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైంది అనే అంశాల మీద కేబినెట్ చర్చించి  నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios