ఆరోగ్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ‌ : మంత్రి హరీశ్‌రావు

Hyderabad: ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తోందని రాష్ట్ర ఆరోగ్య‌, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దీని కోసం తెలంగాణలో ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. అలాగే, వరంగల్ నగరంలో తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

Telangana is creating wonders in the health sector: Health  Minister T Harish Rao RMA

Telangana Health  Minister T Harish Rao: ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుతాలు సృష్టిస్తోందని రాష్ట్ర ఆరోగ్య‌, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. దీని కోసం తెలంగాణలో ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. నీతి ఆయోగ్ కూడా తెలంగాణ పురోగతిని ప్రశంసించిందని  తెలిపారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ లో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గత ఏడాది 8 మెడికల్ కాలేజీలు, రాష్ట్రవ్యాప్తంగా 102 కిడ్నీ డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించి ప్ర‌జ‌ల‌కు ఉత్తమ సేవలు అందిస్తున్నామని గుర్తు చేశారు.

నిధుల కేటాయింపులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించిన హరీశ్ రావు, బీబీనగర్ ఎయిమ్స్ కు 2018లో రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించిందని, కానీ ఆసుపత్రిని ప్రారంభించడానికి కేంద్రానికి నాలుగేళ్లు పట్టిందని అన్నారు. బీజేపీ నేతలు తక్కువ పనులు చేస్తారు కానీ ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నార‌ని ఆరోపించారు. చిన్న చిన్న పనులకు కూడా క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు. వరంగల్ హెల్త్ సిటీ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

కాగా, వరంగల్ నగరంలో తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఆసుపత్రిలో 2000 పడకలు ఉంటాయనీ, ఆరోగ్య వికేంద్రీకరణలో ఇది ఒక పెద్ద ముందడుగు అని మంత్రి అన్నారు. "వరంగల్ సిటీలో 2 వేల పడకలతో తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వాసుపత్రి రూపుదిద్దుకుంటోంది. 33 జిల్లాలకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాలతో ఆరోగ్య వికేంద్రీకరణలో ఇదొక పెద్ద ముందడుగు అవుతుంది. ఆరోగ్య తెలంగాణ విజన్ కోసం సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios