Telangana IPS Transfers : ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్టెనా? : తెలంగాణ పోలీస్ శాఖలో భారీ మార్పులు
ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా ముగిసాయో లేదో అలా భారీగా ఐపిఎస్ లను బదిలీచేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఏకంగా 21 మంది ఐపిఎస్ లకు స్థానచలనం కల్పించింది. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించారంటే...

IPS Transfers : తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీగా మార్పులు చేపట్టింది. పోలీస్ ఉన్నతాధికారులతో పాటు వివిధ జిల్లాల ఎస్పీలను కూడా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికూమారి ఐపిఎస్ బదిలీకి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీచేసారు.
మొత్తం 21 మంది ఐపిఎస్ లకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఇందులో ఒక అడిషనల్ డిజి, ఇద్దరు ఐజీ, ఇద్దరు డిఐజి స్థాయి అధికారులు ఉన్నారు. అలాగే ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలతో పాటు 14 మంది ఎస్పీలకు కొత్త బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.
తెలంగాణలో బదిలీ అయిణ ఐపిఎస్ ల లిస్ట్ :
ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూ శర్మ
సీఐడీ ఐజీగా ఎం.శ్రీనివాసులు
సీఐడీ ఎస్పీగా పి.రవీందర్
ఎస్ఐబి ఎస్పీగా వై.సాయిశేఖర్
అడిషనల్ డీజీపీ (పర్సనల్)గా అనిల్‌కుమార్
ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీగా చేతన
సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా
వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్
నిజామాబాద్ సిపి సాయిచైతన్య
కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర
కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం
ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహజన్
భువనగిరి డీసీపీగా అక్షాన్ష్ యాదవ్
సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్
సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్
సూర్యాపేట ఎస్పీగా నరసింహ
వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్
మంచిర్యాల డీసీపీగా భాస్కర్
పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్

