Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఆ నిబంధన ఎత్తివేసిన ఇంటర్ బోర్డు..

తెలంగాణ ఇంటర్ ( Inter ) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించింది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. వి
 

Telangana Inter Board: Five minute grace for Inter exam candidates in Telangana KRJ
Author
First Published Mar 2, 2024, 12:59 AM IST

Telangana Inter Board: ఇంటర్మీడియట్‌ పరీక్షల నేపథ్యంలో.. తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థుల్ని పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది. విద్యార్థులకు ఐదు నిమిషాలు గ్రేస్ టైమ్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు  ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచించారు. 

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు  ఉదయం 8:45 గంటలకే తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్  తెలిపింది. ఉదయం 9 గంటల తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతి చేస్తామని తెలిపింది. అంటే.. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను ఈ గ్రేస్ పీరియడ్ లో అనుమతిస్తారు.

ఇప్పటివరకు పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకుండా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధన కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారనే విమర్శలు వచ్చాయి. మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ ఇంటర్‌ విద్యార్థి ఈ నిబంధన కారణంగా పరీక్ష రాయలేకపోయారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios