సాత్విక్ సూసైడ్ ఎఫెక్ట్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీ అనుమతి రద్దు
రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీ చైతన్య కాలేజీ బ్రాంచ్ పై ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాత్విక్ ఆత్మహత్యతో ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీ చైతన్య కాలేజీ బ్రాంచ్ కు ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం నాడు నోటీసులు జారీ చేశారు. వచ్చే ఏడాది ఈ కాలేజీకి అనుమతిని రద్దు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీ'సుకున్నారు.
గత నెల 28వ తేదీన ఈ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదివే సాత్విక్ అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
ఇవాళ కార్పోరేట్ కాలేజీలతో ఇంటర్ బోర్డు హైద్రాబాద్ లో సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి సాత్విక్ మృతిపై శ్రీచైతన్య కాలేజీ సంస్థల ప్రతినిధులు క్షమాపణలు చెప్పారు. అయితే ఈ ఘటనపై క్షమాపణ చెప్పడం చాలా చిన్న విషయంగా ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ అభిప్రాయపడ్డారు.
నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో సాత్విక్ ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానిక అందించింది. శ్రీచైతన్య కాలేజీలో సాత్విక్ పై వేధింపులు నిజమేనని ఈ కమిటీ తేల్చి చెప్పింది. కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్ధులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా కమిటీ ప్రభుత్వానికి కమిటీ నివేదికను ఇచ్చింది.
శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ను గతంలో కూడా లెక్చరర్లు కొట్టారు. ఈ ఘటనలో 15 రోజుల పాటు సాత్విక్ ఇంటి వద్దనే ఉన్నాడని పేరేంట్స్ గుర్తు చేస్తున్నారు. సాత్విక్ ఆత్మహత్యకు గల కారణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మహత్య చేసుకొనే ముందే సాత్విక్ సూసైడ్ లెటర్ రాశాడు. కాలేజీలో తనను ఏ రకంగా వేధింపులకు గురి చేశారనే విషయమై ఆ లేఖలో పేర్కొన్నాడు సాత్విక్.
సాత్విక్ ఆత్మహత్య ఘటనతో విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని విద్యార్ధి సంఘాల నేతలు ముట్టడించారు. ఇంటర్ బోర్డు ముందు కూడా విద్యార్ధి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి.
also read:సాత్విక్ ఆడ్మిషన్ మరో కాలేజీలో ఉన్న విషయం తెలియదు: పేరేంట్స్
విద్యార్ధులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తున్నాయని విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగిన సమయంలో హడావుడి చేయడం మాని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు కోరుతున్నారు.