తనదైన శైలిలో సుపరిపాలన అందించి అనతికాలంలోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాటా ఇకపై కేంద్ర సర్వీసుల్లో పనిచేయనున్నారు. ఢిల్లీలోని కేంద్ర కేబినెట్ సెక్రటేరియేట్‌లో ఆమె డిప్యూటీ కార్యదర్శిగా డిప్యూటేషన్‌పై వెళ్లనున్నారు.

2010 ఏపీ ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన ఆమ్రపాలి వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సేవలందించారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత ఆమ్రపాలి పదోన్నతిపై వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అదనపు కమీషనర్ పోస్టులో ఉన్న ఆమ్రపాలి కొంతకాలంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

Also Read:కిషన్ రెడ్డి కొలువులో ఆమ్రపాలి: కేసీఆర్ కోర్టులో బంతి

 

అమ్రపాలి 2011 బ్యాచ్ ఐపిఎస్ అధికారి సమీర్ శర్మ భార్య. ఆయనది ఢిల్లీ స్వస్థలం. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు. నిరుడు జనవరిలో వారిద్దరు వివాహం చేసుకున్నారు. ఆమ్రపాలి గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం.

కిషన్ రెడ్డి విజ్ఞప్తితో ఆమెను డిప్యూటేషన్‌పై పంపించాలని కేంద్ర ప్రభుత్వం కోరగా.. తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అయితే, కేంద్రం నుంచి ఈ నియామక సమాచారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వెళ్లింది. 

ఐఎఎస్ అధికారి ఆమ్రపాలి గతంలో వరంగల్ కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలోనే ఆమె బాగా ఫేమస్ అయ్యారు.కొండలపై ట్రెకింగ్ చేయడం, మరో కలెక్టర్ తో కలిసి అడవిలో పర్యటించడం వంటి సాహసోపేత కార్యక్రమాలు చేపట్టారు.

Also Read:జిహెచ్ఎంసికి ఆమ్రపాలి బదిలీ: ఐఎఎస్ లకు స్థానచలనం

ఇలా వినూత్నంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతలా అంటే గత వినాయక చవితి సందర్భంగా వినాయకుడితో పాటు ఆమె విగ్రహాన్ని కూడా కొందరు అభిమానులు ప్రతిష్టించారు. ఇలా ఏ కలెక్టర్ కు లేని పబ్లిసిటీని ఆమ్రపాలి సంపాధించారు.

అప్పట్లో తాను నివాసం ఉంటున్న అధికారిక భవనంలో దెయ్యం ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్  గా మారింది.

తనకు దెయ్యాలంటే చాలా భయమని ఆమె చెప్పారు.వరంగల్ లో తాను నివాసం ఉంటున్న భవనానికి 133 ఏళ్ల క్రితం శంకుస్థాపన జరిగిన విషయాన్ని ఆమె  గుర్తు చేసుకొన్నారు. 133 ఏళ్ల క్రితం ఆగష్టు 10వ తేదీన ఈ భవనానికి శంకుస్థాపన చేసినట్టుగా ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.

జార్జ్ పామర్ అనే గొప్ప ఇంజనీర్ భార్య ఈ క్యాంపు కార్యాలయానికి శంకుస్థాపన చేసిన విషయాన్ని తాను తెలుసుకొన్నట్టు చెప్పారు. జార్జ్ పామర్ గురించి తెలుసుకోవడానికి తాను చాలా కష్టపడినట్టు ఆమె చెప్పారు.

నిజాం నవాబు కాలంలో పనిచేసిన ఇంజనీర్లలో పేరొందిన ఇంజనీర్ పామర్  అని తనకు తెలిసిందన్నారు. అయితే ఈ భవనంలో  నివాసం ఉన్న కలెక్టర్లు ఈ భవనం మొదటి అంతస్థులో దెయ్యం ఉందని చెప్పారని గుర్తు చేసుకొన్నారు. అయితే తాను ఈ భవనంలోని మొదటి అంతస్థును పరిశీలించినట్టు చెప్పారు. గదిలోని వస్తువులన్నీ చిందరవందరగా ఉంటే వాటిని సర్థి పెట్టించినట్టు చెప్పారు.

Also Read:ఆమ్రపాలికి ‘దెయ్యం’ షాక్

అయితే ఈ గదిలో దెయ్యం ఉందనే భయంతో తాను ఎప్పుడూ ఈ గదిలో పడుకోవడానికి సాహసించబోనని ఆమె చెప్పారు