జిహెచ్ఎంసికి ఆమ్రపాలి బదిలీ: ఐఎఎస్ లకు స్థానచలనం

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 30, Aug 2018, 7:53 AM IST
11 Telangana IAS officers district collectors transferred
Highlights

ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఎఎస్ అధికారులకు స్థానచలనం కలిగించింది. 

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఎఎస్ అధికారులకు స్థానచలనం కలిగించింది.  జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమ్రపాలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ఉన్న భారతి హొళికేరిని మంచిర్యాల కలెక్టర్‌గా బదిలీ చేశారు. అమయ్‌కుమార్ బదిలీని నిలిపివేశారు. ఆయన స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా రజత్‌కుమార్ సైనీని నియమించారు. 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న శశాంకను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. వ్యవసాయశాఖ కమిషనర్‌గా రాహుల్ బొజ్జాను నియమించారు. బుధవారం జరిగిన బదిలీల్లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది.

loader