Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్‌కి హైకోర్టులో ఊరట: సిట్ నోటీసులపై స్టే

బీజేపీ  అగ్రనేత  బీఎల్  సంతోష్ కి  తెలంగాణ  హైకోర్టు  స్టే  విధిస్తూ  తెలంగాణ  హైకోర్టు  ఆదేశాలు జారీ  చేసింది. 

telangana  High  Court  Stays  On SIT  Notice  To  BJP Leader  BL Santosh
Author
First Published Nov 25, 2022, 5:12 PM IST

హైదరాబాద్: బీజేపీ అగ్రనేత  బీఎల్ సంతోష్ కి  తెలంగాణ హైకోర్టులో  శుక్రవారంనాడు  ఊరట లభించింది.   సిట్ ఇచ్చిన  నోటీసులపై  హైకోర్టు  స్టే  విధించింది.  ఈ  పిటిషన్ పై విచారణను  ఈ ఏడాది డిసెంబర్  5వ తేదీకి వాయిదా  వేసింది.తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్  రెడ్డి  ఇచ్చిన  ఫిర్యాదులో  బీఎల్ సంతోష్  పేరు లేదని కూడా ఈ సందర్భంగా  ఆయన తరపు న్యాయవాది చెప్పారు. ఫిర్యాదులో  సంతోష్  పేరు లేకున్నా  ఎఫ్ఐఆర్ లో  ఎలా  చేర్చారని  న్యాయవాది  అభ్యంతరం  వ్యక్తం  చేశారు.ఎమ్మెల్యేల ప్రలోభాల  కేులో  బీఎల్ సంతోష్ కు సంబంధించిన ఆధారాలున్నాయని అడ్వకేట్ జనరల్  వాదించారు. సిట్ విచారణకు సంతోష్  వస్తే  అన్ని విషయాలు  బయటకు వస్తాయని  అడ్వకేట్ జనరల్ చెప్పారు. 

41 ఏ నోటీసులిచ్చిన తర్వాత  సంతోష్ ను ఈ కేసులో నిందితుడిగా చేర్చినట్టుగా  ఏసీబీ కోర్టులో  మెమో  దాఖలు  చేసిన విషయాన్ని సంతోష్  తరపు న్యాయవాది ప్రస్తావించారు. 41 ఏ నోటీసుల విషయంలో సింగిల్  జడ్జి  ఆదేశాలను  ఏజీ  ఈ  సందర్భంగా ప్రస్తావించారు. బీఎల్  సంతోష్  కు  రెండు దఫాలు  సిట్  నోటీసులు  ఇచ్చింది.  అయితే  ఈ  నోటీసులపై  స్టే  ఇచ్చింది  హైకోర్టు. 

తెలంగాణ హైకోర్టు  బీజేపీ  అగ్రనేత  బీఎల్ సంతోష్  శుక్రవారంనాడు  క్వాష్ పిటిషన్  దాఖలు  చేశారు.  నిన్ననే రెండోసారి  సిట్ అధికారులు బీఎల్ సంతోష్ కి   జారీ  41 ఏ సీఆర్‌సీపీ  కింద  నోటీసులు జారీ  చేసిన  విషయం  తెలిసిందే. ఈ  క్వాష్ పిటిషన్ పై  ఇవాళ  విచారణ నిర్వహించారు. ఇరు వర్గాల వాదనలను విన్నత తర్వాత హైకోర్టు  స్టే  ఇచ్చింది. 

రెండు రోజుల  క్రితం  తెలంగాణ హైకోర్టు  బీఎల్ సంతోష్ కి  మరోసారి  నోటీసులు జారీ  చేయాలని ఆదేశించింది.దీంతో  ఈ  కేసులో  41ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ  చేశారుఈ  కేసులో బీఎల్ సంతోష్ పాటు  తుషార్, జగ్గుస్వామిలపై  కూడా   పోలీసులు  కేసు నమోదు  చేశారు. ఈ విషయాన్ని  మెమో  ద్వారా  హైకోర్టుకు  సిట్  తెలిపింది.

also read:తెలంగాణ హైకోర్టుకి బీఎల్ సంతోష్: క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత

ఈ  కేసులో  సిట్  బృందం  దేశంలొని పలు  రాష్ట్రాల్లో  సోదాలు  నిర్వహించారు.  కేరళ, హర్యానా, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక  రాష్ట్రాల్లో  సోదాలు  నిర్వహించారు. కేరళ  రాష్ట్రంలోనే  ఈ కేసుకు సంబంధించి  కొంత  సమాచారాన్ని  సిట్  సేకరించిందని ప్రచారం సాగుతుంది.  రామచంద్రభారతికి తుషార్ కి మధ్యవర్తిగా  జగ్గుస్వామి వ్యవహరించినట్టుగా  గుర్తించారని  సమాచారం. జగ్గుస్వామి , తుషార్,  బీఎల్  సంతోష్ లను ఈ నెల  21న విచారణకు  రావాలని సిట్  నోటీసులు  జారీ  చేసింది. కానీ వీరెవరూ  కూడా విచారణకు  రాలేదు.  బీఎల్  సంతోష్ కు ఢిల్లీ పోలీసుల సహాయంతో  బీజేపీ  కార్యాలయంలో  పోలీసులు నోటీసులు అందించారు.  తనకు  సమయం  కావాలని  బీఎల్ సంతోష్  సిట్ కు లేఖ రాశాడు. తాజాగా పంపిన  నోటీసుపై  ఆయన  క్వాష్ పిటిషన్  దాఖలు  చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios