హైదరాబాద్: కరోనా వ్యాధి తెలంగాణ రాష్ట్రంలో ప్రబలకుండా ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాధి నివారణ విషయంలో తీసుకొంటున్న చర్యలపై గురువారం నాడు హైకోర్టు విచారణ చేసింది.

Also read:కరోనా ఎఫెక్ట్: లేడీ కండక్టర్ ను బస్సు నుంచి దింపేసి.. ఆస్పత్రికి...

ప్రజలకు ఉచితంగా మందులను, మాస్క్‌లను పంపణీ చేస్తున్నామని హైకోర్టుకు అధికారులు వివరించారు. అయితే మురికివాడల్లో ప్రజలు చేతులు కడుక్కొనేందుకు మంచినీళ్లు సరఫరా చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది.

 అన్ని ప్రాంతాల్లో ఉచితంగా మందులు సరఫరా చేస్తున్నారా హైకోర్టు ప్రశ్నించింది.  రాష్ట్రంలోని జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసినట్టుగా వైద్యశాఖాధికారులు హైకోర్టుకు నివేదికను ఇచ్చారు. 

ఈ కమిటీలో ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాధి ప్రబలకుండా  చర్యల గురించి  ఈ కమిటీ సూచనలు ఇవ్వనున్నాయని అధికారులు వివరించారు.బస్సు స్టేషన్లలో స్క్రీనింగ్ సౌకర్యం కల్పించాలని  హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.