ఏలూరు: ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోకు చెందిన మహిళా కండక్టర్  కు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఏపీ రాష్ట్రంలో చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్‌ కు గురువారం నాడు సత్తుపల్లి నుండి చింతలపూడికి డ్యూటీకి వెళ్లారు. అయితే  ఆమెకు జ్వరంతో పాటు జలుబు ఉంది.

also read:దేశంలో 29 కరోనా కేసులు, యుద్దప్రాతిపదికన చర్యలు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

దీంతో ఈ లక్షణాలు కరోనా వ్యాధికి సంబంధించినవేనని ప్రయాణీకులు ఆమెను బలవంతంగా బస్సును దింపి ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నారు.

సాధారణ జ్వరం కారణంగానే ఆమె ఇబ్బంది పడుతున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. తప్పుడు ప్రచారాన్ని నిలిపివేయాలని కోరుతున్నారు.

ఇదిలా ఉండగా కరోనా భయం కారణంగా ఆర్టీసీ ఆదాయం కూడ గణనీయంగా తగ్గింది.  అవసరమైతే తప్ప కూడ జనం ప్రయాణం చేయడం లేదు. దీంతో ఆర్టీసీ ఆదాయం గణనీయంగా తగ్గినట్టుగా అధికారులు గుర్తించారు. ఆర్టీసీ కూడ కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకొంటుంది. ఇప్పటికే మెట్రో రైలులో శానిటేషన్‌ ను మరింత మెరుగుపర్చారు అధికారులు.