తెలంగాణలోని నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు అధికారులకు నాలుగు వారాల జైలు శిక్ష విధించింది.
తెలంగాణలోని నలుగురు పోలీసు అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు అధికారులకు నాలుగు వారాల జైలు శిక్ష విధించింది. హైకోర్టు జైలు శిక్ష విధించిన వారిలో జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ నరేష్‌లు ఉన్నారు. భార్యభర్తల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్దంగా వ్యవహరించారని ఈ నలుగురు పోలీసులు అధికారులపై ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వలేదని అభియోగాలు దాఖలయ్యాయి.
ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. వారికి నాలుగు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాకుండా నలుగురు అధికారులపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే వారు అప్పీలుకు వెళ్లేందుకు శిక్ష అమలును 6 వారాలు నిలిపివేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.
