హైదరాబాద్: సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై  విచారణను తెలంగాణ హైకోర్టు  ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీకి  వాయిదా వేసింది.

ఏపీ రాష్ట్రానికి సీఎంగా పరిపాలన వ్యవహారాల్లో నిరంతరం బిజీగా ఉంటున్నందున వ్యక్తిగతంగా సీబీఐ కోర్టుకు హాజరుకాలేమని హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేసింది.

Also read:సిబిఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు షాక్

విచారణ ఇంకా పూర్తి కానందున ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీన ఈ పిటిషన్ పై విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే ఈ  పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సాగుతున్న విషయాన్ని సీబీఐ కోర్టుకు తెలపాలని జగన్ తరపు న్యాయవాదికి హైకోర్టు సూచించింది.