రవికుమార్ మృతి ఎలా జరిగిందో తేల్చాలని పోలీసులను ఆదేశించాలా: హైకోర్టు
చెస్ట్ ఆసుపత్రిలో రవికుమార్ కు అందించిన చికిత్సకు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఆగష్టు 18వ తేదీకి వాయిదా వేసింది.
హైదరాబాద్ చెస్ట్ ఆసుపత్రిలో రవికుమార్ కు అందించిన చికిత్సకు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఆగష్టు 18వ తేదీకి వాయిదా వేసింది.
హైద్రాబాద్ జవహర్ నగర్ కు చెందిన రవికుమార్ అనే యువకుడు చెస్ట్ ఆసుపత్రిలో కరోనా చికిత్స కోసం చేరాడు. ఆసుపత్రిలో సరైన చికిత్స అందించలేదని ఆయన ఆరోపించాడు.
తనకు వెంటిలేటర్ పెట్టాలని కోరినా కూడ పట్టించుకోలేదన్నారు. ఈ విషయమై తన తండ్రిని ఉద్దేశించి ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ఈ వీడియో రికార్డు చేసిన కొద్దిసేపటికే రవికుమార్ మరణించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఈ ఏడాది జూన్ 28వ తేదీన చోటు చేసుకొంది.
also read:వెంటిలేటర్ పెట్టాలని వేడుకొన్నాడు: చనిపోయే ముందు యువకుడి సెల్పీ వీడియో
రవికుమార్ మరణంపై న్యాయవాది యశ్ పాల్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారంగానే రవికుమార్ కు చికిత్స నిర్వహించినట్టుగా చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండ్ చెప్పారు.
రవికుమార్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయాన్ని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. రవికుమార్ ఎలా మరణించారో తెలుసుకోవాలని పోలీసులను ఆదేశించాలా అని హైకోర్టు ప్రశ్నించింది.
రవికుమార్ కు అందించిన చికిత్స వివరాలకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఆగష్టు 18వ తేదీకి వాయిదా వేసింది.