హైదరాబాద్: హైద్రాబాద్ లోని జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కరోనాతో మరణించాడు. చెస్ట్ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతూ ఆదివారం నాడు మరణించాడు. ఆసుపత్రిలో వెంటిలేటర్ ఆమర్చడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని సెల్పీ వీడియోను కుటుంబసభ్యులకు పంపాడు.

జీహెచ్ఎంసీ పరిధిలోని జవహర్ నగర్ కు చెందిన యువకుడు కరోనాతో చెస్ట్ ఆసుపత్రిలో చేరాడు. తనకు శ్వాస ఆడడం లేదని వెంటిలేటర్ పెట్టాలని ఆసుపత్రి సిబ్బందిని వేడుకొన్నా కూడ పట్టించుకోలేదని బాధితుడు ఆరోపించాడు.

మూడు గంటలు వేడుకొన్న తర్వాత వెంటిలేటర్ పెట్టారని అప్పటికే తన గుండె, కిడ్నీలు పాడైపోయాయని చెప్పారు.బాయ్ డాడీ అంటూ తన తండ్రిని ఉద్దేశించి అతను ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. 

అంతేకాదు అందరికీ బై అంటూ వ్యాఖ్యానించాడు. తాను ఎంత చెప్పినా కూడ ఆసుపత్రి సిబ్బంది వినలేదని ఆయన ఆరోపించాడు.  తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా  కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో శనివారం నాడు ఒక్క రోజే 1087 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 13,436కి  చేరుకొన్నాయి.