కరోనా ఎఫెక్ట్: షెల్టర్ హోమ్స్‌లో సౌకర్యాలపై నివేదిక కోరిన తెలంగాణహైకోర్టు
వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్స్ పై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
హైదరాబాద్:వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్స్ పై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్‌డౌన్ ను మే 3వ తేదీ వరకు విధించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో వలస కూలీలు, యాచకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
యాచకులు, వలసకూలీలను షెల్టర్ హోమ్ లకు తరలించాలని అడ్వకేట్ ఎస్. నందా రాసిన లేఖను హైకోర్టు పిటిషన్ గా స్వీకరించింది. ఈ మేరకు ఈ పిటిషన్ పై బుధవారం నాడు విచారణ చేసింది.
యాచకులు, వలస కూలీలను వెంటనే షెల్టర్ హోమ్ లకు తరలించాలని పిటిషనర్ తన లేఖలో కోరారు. షెల్టర్ హోమ్ లపై మే 7వ తేదీలోపుగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.
రాష్ట్రంలో ఎన్ని షెల్టర్ హోమ్స్ ఉన్నాయి, వాటిలో ఎంత మంది ఉన్నారు, వసతుల్లోని సదుపాయాల గురించి చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
also read:కోర్టులకు వేసవి సెలవులు రద్దు: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
మార్చి 27వ తేదీ నుండి అత్యవసర పిటిషన్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారణ చేస్తోంది తెలంగాణ హైకోర్టు.మే నుండి జూన్ 5 వరకు అన్ని కోర్టులకు వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్టుగా హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.