Asianet News TeluguAsianet News Telugu

డిజిటల్ బోధనకే కేంద్రం గైడ్‌లైన్స్: హైకోర్టుకు తెలిపిన తెలంగాణ సర్కార్

డిజిటల్ బోధనను ప్రోత్సహించేలా కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసిందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది ఆగష్టు 6వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Telangana High court orders to submit NCERT guidelines
Author
Hyderabad, First Published Jul 22, 2020, 2:21 PM IST


హైదరాబాద్: డిజిటల్ బోధనను ప్రోత్సహించేలా కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసిందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది ఆగష్టు 6వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

also read:విద్యా సంవత్సరం స్టార్ట్ కాలేదు: ఆన్‌లైన్ క్లాసులపై హైకోర్టులో తెలంగాణ సర్కార్

ప్రైవేట్ స్కూళ్లు ఆన్ లైన్ పాఠాల పేరుతో ఫీజులు దండుకొంటున్నారని ఆరోపిస్తూ ఈ నెల 1వ తేదీన పేరేంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేసింది. 

డిజిటల్ బోధనను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు చేసిందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.  అయితే ఈ విషయమై ఎన్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాలను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరో వైపు ఇదే పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి తమకు రెండు వారాల గడువును సీబీఎస్ఈ కోరింది.

ఈ కేసుపై విచారణను ఆగష్టు 6వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఆన్ లైన్ క్లాసులపై ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటి నిర్ణయం తీసుకొంటుందని ప్రభుత్వ తరపున న్యాయవాది ఇదివరకే హైకోర్టుకు నివేదించారు. రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదని ఈ నెల 13వ తేదీన జరిగిన విచారణ సమయంలో హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios