హైదరాబాద్: తెలంగాణ  రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదని హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం.


తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ లో తరగతుల నిర్వహణపై శుక్రవారం నాడు హైకోర్టు విచారించింది. రాష్ట్రంలో ఇంకా విద్యాసంవత్సరం ప్రారంభం కాని విషయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

also read:ఆన్‌లైన్ క్లాసులు: ప్రభుత్వం, విద్యాశాఖకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఆన్ లైన్ క్లాసులపై హైకోర్టుకు ప్రభుత్వం ఎలాంటి నివేదికను సమర్పించలేదు.  ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటి తుది నిర్ణయం తీసుకొంటుందని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది.

నిర్ణయం తీసుకోనప్పుడు ఆన్ లైన్ క్లాసులు ఎందుకు నిర్వహిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.  ఈ తరహా ఆన్ లైన్ క్లాసుల వల్ల పేద విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతోందని హైకోర్టు ప్రశ్నించింది. 

ఈ నెల 13వ తేదీ లోపుగా నిర్ధిష్ట ప్రణాళికను సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫీజులు దండుకొంటున్నాయని పేరేంట్స్ అసోసియేషన్ ఈ నెల 1వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను ఇవాళ కూడ కొనసాగించింది హైకోర్టు.