హైదరాబాద్: అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ లోపుగా డబ్బుల పంపిణీని పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిపింది. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలోని డిపాజిట్ దారులకు  డబ్బులను చెల్లిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని డిపాజిట్ దారులకు కూడ డబ్బులు చెల్లించే విషయమై తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

రూ. 20 వేల లోపు డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. డిపాజిట్ దారులన వివరాలను సీఐడీ ద్వారా సేకరిస్తామని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు తెలిపింది.

కలెక్టర్, సీఐడీ, ఎస్పీల ద్వారా ధరఖాస్తుల ద్వారా  ధృవీకరిస్తారని  ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కలెక్టరేట్ ద్వారా అర్హులైన డిపాజిటర్ల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

also read:అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు సీఐడీ గుడ్‌న్యూస్

ఈ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్ పై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసును బదిలీ చేసే అధికారం తెలంగాణ హైకోర్టు సీజే కు ఉంటుందని ధర్మాసనం తెలిపింది. 

ఈ కేసు విషయంలో అవసరమైన చర్యలు తీసుకొనేందుకుగాను రెండువారాల గడువును తెలంగాణ  హైకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది. ఏపీ ప్రభుత్వం కోరిన గడువుకు తెలంగాణ హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

వార్డు సచివాలయం ద్వారా డిపాజిట్ దారుల వివరాలను సేకరిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.సేకరించిన వివరాలను డీఎస్పీ, ఆర్డీఓలు పరిశీలిస్తారని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.