Asianet News TeluguAsianet News Telugu

అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు సీఐడీ గుడ్‌న్యూస్

 అగ్రి గోల్డ్ డిపాజిట్ దారులకు త్వరలోనే డబ్బులు చెల్లించనున్నట్టుగా ఏపీ సీఐడీ సోమవారం నాడు ప్రకటించింది. డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించాలని ఏపీ హైకోర్టు నుండి ఉత్తర్వులు రాగానే డబ్బులు చెల్లిస్తామని ఏపీ సీఐడీ తెలిపింది.
 

CID announces to release funds after Ap high court orders lns
Author
Amaravathi, First Published Sep 28, 2020, 3:15 PM IST

అమరావతి:  అగ్రి గోల్డ్ డిపాజిట్ దారులకు త్వరలోనే డబ్బులు చెల్లించనున్నట్టుగా ఏపీ సీఐడీ సోమవారం నాడు ప్రకటించింది. డిపాజిట్ దారులకు డబ్బులు చెల్లించాలని ఏపీ హైకోర్టు నుండి ఉత్తర్వులు రాగానే డబ్బులు చెల్లిస్తామని ఏపీ సీఐడీ తెలిపింది.

20 వేల రూపాయాలను డిపాజిట్ చేసిన డిపాజిట్ దారులకు చెల్లించనున్నట్టుగా సీఐడీ తెలిపింది. పది వేల రూపాయాలు డిపాజిట్లు చేసిన వారికి కూడ డబ్బులు అందకపోతే వారికి రూ. 20 వేల డిపాజిట్లు చేసినవారితో చెల్లించనున్నట్టుగా సీఐడీ ప్రకటించింది.

అగ్రిగోల్డ్ లో రూ. 10వేలు డిపాజిట్ చేసినవారు సుమారు 3 లక్షల 59వేల 655 మంది ఉంటారని సీఐడీ నివేదిక తేల్చి చెబుతోంది. వీరందరికి రూ. 264 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.  తొలి విడతలో రూ. 10 వేలు డిపాజిట్ చేసిన వారికి డబ్బులు అందకపోతే వారికి రెండో విడతలో రూ. 20 వేలు డిపాజిట్ చేసినవారితో చెల్లించనున్నట్టుగా సీఐడీ సోమవారం నాడు ప్రకటించింది.

అగ్రిగోల్డ్ పై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే కొంత మంది డిపాజిట్ దారులకు డిపాజిట్లను చెల్లించారు. రెండో విడతలో ఇతర డిపాజిట్ దారులకు డబ్బులు తిరిగి ఇవ్వనున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios