హైదరాబాద్:  గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో కరోనా పరీక్షల విషయమై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహించడం లేదని ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై సోమవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది.కరోనా లక్షణాలు ఉన్న వారందరికి టెస్టులు చేయడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

also read:తెలంగాణలో కరోనా మరణాలను తక్కువ చేసి చూపుతున్నారు: హైకోర్టు ఆగ్రహం

కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఆసుపత్రుల్లో బెడ్స్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి. ఎన్ని బెడ్లలో రోగులు ఉన్నారనే విషయమై ఆసుపత్రుల్లో డిస్ ప్లే చేయడం లేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.

తెలంగాణ కరోనా మరణాలను తక్కువ చేసి చూపుతున్నారని మూడు రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా మరణాలపై వాస్తవ నివేదికను  ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.