Asianet News TeluguAsianet News Telugu

ఆన్‌లైన్ క్లాసులు: ప్రభుత్వం, విద్యాశాఖకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

రాష్ట్రంలో ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వానికి, విద్యాశాఖకు తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది.

Telangana High court issues notice to government over online classes
Author
Hyderabad, First Published Jul 1, 2020, 12:46 PM IST


హైదరాబాద్: రాష్ట్రంలో ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వానికి, విద్యాశాఖకు తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసుల నిర్వహిస్తూ ఫీజులు వసూలు చేస్తున్నాయని పేరేంట్స్ అసోసియేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది.Telangana High court issues notice to government over online classesఈ పిల్ పై తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు విచారణ ప్రారంభించింది.  ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రభుత్వ అడ్వకేట్ ను హైకోర్టు ప్రశ్నించింది.

ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఆన్ లైన్ లో పిల్లలకు విద్యాబోధన సాధ్యమా అని ప్రశ్నించింది.ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థులను మూడు గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చోబెడితే ఆరోగ్యం ఎలా ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది.

ఆన్ లైన్ విద్యాబోధనపై ప్రభుత్వం పాలసీని రూపొందించిందా అని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది.ఆన్ లైన్ క్లాసుల విషయమై డీఈఓలు చర్యలు తీసుకొంటున్నారని హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది వివరించారు. ఎల్లుండి లోపుగా ఆన్ లైన్ క్లాసులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖకు హైకోర్టు నోటీసులు పంపింది.

Follow Us:
Download App:
  • android
  • ios